తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పెళ్లిపై వీజే సన్నీ క్వశ్చన్​.. స్టేజ్​పైనే వరుణ్​ సందేశ్​కు చెమటలు.. శేఖర్ మాస్టర్​ అయితే..! - ఆలీతో ఆల్‌ ఇన్‌ వన్‌

ఓ షోలో.. శేఖర్ మాస్టర్​తో పాటు యాంకర్ విజే సన్నీ, నటుడు వరుణ్​ సందేశ్ కలిసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పెళ్లి గురించి ప్రస్తావన రాగా.. వరుణ్​ సందేశ్​, శేఖర్​ మాస్టర్​.. తమదైన స్టైల్​లో సమాధానం చెప్పి నవ్వులు పూయించారు! ఆ సంగతులు..

Dhee Premier League and Ali All In One Show New Seasons
పెళ్లి గురించి వీజే సన్నీ క్వశ్చన్​.. స్టేజ్​పైనే వరుణ్​ సందేశ్​కు చెమటలు.. శేఖర్ మాస్టర్​ అయితే..!

By

Published : Jun 20, 2023, 5:30 PM IST

Updated : Jun 20, 2023, 7:04 PM IST

ETV Dhee Program : 'ఢీ' షో.. పేరుకు తగ్గట్టుగానే ఇతర డ్యాన్స్​ షోలను ఢీ కొట్టే విధంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. అయితే 15 సీజన్​లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ ప్రోగ్రాం ఇప్పుడు 'ఢీ ప్రీమియర్​ లీగ్'​ పేరుతో జూన్​ 21 నుంచి అలరించేందుకు రెడీ అయింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్​గా లాంఛ్​ చేసింది షో బృందం. దీనికి సంబంధించిన వీడియో ప్రోమోను యూట్యూబ్​లో విడుదల చేశారు నిర్వాహకులు. అప్లోడ్​ చేసిన కొద్దిగంటల్లోనే లక్షల వ్యూస్​తో దూసుకుపోతోంది ఈ షో ప్రోమో.

ఇక ఈ షో కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఆడిషన్స్​ జరిపి డ్యాన్స్​లో ఆణిముత్యాలను వెతికి మరీ తీసుకొచ్చామని యాంకర్​ ప్రదీప్​ అన్నారు. ఈ షోలో శేఖర్​ మాస్టర్​తో పాటు నటి, డ్యాన్సర్​ పూర్ణ జడ్జిలుగా వ్యవహరించనున్నారు. ఫస్ట్​ ఎపిసోడ్​లో ఛీప్​ గెస్ట్​లుగా హీరో వరుణ్​ సందేశ్​తో పాటు వీజే సన్నీ కూడా వచ్చి సందడి చేశారు.

వరుణ్ సందేశ్​కు చెమటలు..!ఇక ఈ ప్రోమోలో స్టేజ్​పై హైపర్ ఆది కొన్ని పంచ్​లు వేస్తూ నవ్వించారు. అయితే ఆ సమయంలో పెళ్లి కానీ సోదరులు పెళ్లి చేసుకోవచ్చా అని హైపర్ ఆది.. వరుణ్ సందేశ్​ను అడగగా.. 'పెళ్లి చేసుకోండి అదిరిపోతుంది' అంటూ కాస్త సెటైరికల్​గా అన్నారు. వెంటనే హైపర్ ఆది.. ఏంటి చెమటలు వస్తున్నాయి అంటూ నవ్వులు పూయించారు. ఆ వెంటనే వీజే సన్నీ కూడా.. ఇదే ప్రశ్నను శేఖర్​ మాస్టర్​ను అడగగా.. మళ్లీ హైపర్ ఆది మాట అందుకుని.. 'ఆయన చేసుకున్న పెద్ద బాధ ఏమి ఉండదు. ఇంట, బయట రెండు భోజనాలు చేస్తారు' అంటూ నవ్వించారు. దీనికి స్పందించిన శేఖర్ మాస్టర్.. ​' నీ యంకమ్మ.. ఆయన క్వశ్చన్​ అడిగింది నన్ను..​' అంటూ సరదాగా మాట్లాడారు.

ETV Dhee Dance Show : ఈ సీజన్​లో ఆంధ్ర ప్రదేశ్​లోని రెండు ప్రాంతాల నుంచి.. తెలంగాణలోని రెండు ప్రాంతాల నుంచి డ్యాన్స్​ టీమ్స్​ను ఆడియెన్స్​కు పరిచయం చేస్తున్నట్లు ఈ ప్రోమోలో చూపించారు.. హైదరాబాద్​ ఉస్తాద్స్​, ఓరుగల్లు వీరులు, బెజవాడ టైగర్స్​, నెల్లూరు నెరజాణలు పేరుతో నాలుగు టీమ్​లు ఈ షోలో సందడి చేయనున్నాయి. ఇక ఈ ప్రోమోలో హైలైట్​గా ప్రముఖ కమెడియన్ హైపర్​ ఆది పంచ్​లు.. మరోవైపు యాంకర్​ ప్రదీప్​ స్పాంటేనియస్​ డైలాగ్​లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా కనిపిస్తున్నాయి.

గంగవ్వ గోరుముద్దలు..!
ETV D Program : ఇక ఈ తొలి ఎపిసోడ్​లో బిగ్​బాస్​ ఫేమ్​ గంగవ్వ సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​గా నిలవనుంది. హైపర్​ ఆదిపై ఆమె వేసిన జోక్​ బాగా నవ్వించింది. అయితే తానే స్వయంగా ఆవకాయ అన్నంను కలుపుకొని ఓ క్యాన్​లో షోకు తీసుకువచ్చారు. తెచ్చిన దానిని అక్కడ స్టేజీపై ఉన్న డ్యాన్సర్​లతో పాటు యాంకర్​ ప్రదీప్​, జడ్జీలు శేఖర్​ మాస్టర్​, నటి పూర్ణకు కూడా తన చేతులతో తినిపించారు. గంగవ్వ గోరుముద్దలు తిన్న కొందరు ఎమోషనల్​కు లోనయ్యారు. ఈ షో ప్రతి బుధవారం రాత్రి 9:30 నిమిషాలకు ఈటీవీలో ప్రసారం కానుంది. దీని కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆల్‌ ఇన్‌ వన్‌ కమెడీతో ఆలీ రెడీ..!
Alitho All In One Show : ఎక్కడైనా కామెడీ కింగ్‌​ ఆలీ ఉన్నాడంటే అక్కడ నవ్వులు పూయడం ఖాయం. ఇది చాలా సందర్భాల్లో నిరూపితం అయింది. ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యావహరించే షోలకు విరరీతమైన ఫ్యాన్స్​ ఉంటారు. అంతలా తన కామెడీ మాయాజాలంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. ఆలీ- 369, ఆలీతో జాలీగా, ఆలీతో సరదాగా.. ఇలా ఈటీవీలో ఆలీ చేసిన ప్రతి షో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ సరికొత్తగా ఓ గేమ్‌ షోను, ఓ డ్యాన్స్‌ షోను, ఓ టాక్‌ షోను, ఓ క్విజ్‌ షోను.. కలగలిపి మెస్మరైజింగ్‌ స్టైల్‌లో తెలుగు ప్రజల ముందుకు రాబోతున్నారు ఆలీ. అదే.. 'ఆలీతో- ఆల్‌ ఇన్‌ వన్‌!'. ఈ రోజు(జూన్​ 20) నుంచి ప్రతి మంగళవారం రాత్రి 9.30కు మీ ఈటీవీలో ప్రసారం కాబోతోంది. ఇక ఈ రోజు(జూన్​ 20) ప్రసారం కాబోతున్న మొదటి ఎపిసోడ్‌లో యువనటులు అవినాష్‌, సిరి, అమర్‌ దీప్‌ పోటీ పడబోతున్నారు.

Last Updated : Jun 20, 2023, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details