తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఈడీ నోటీసులు - రకుల్ ప్రీత్ సింగ్​కు ఈడీ నోటీసులు

ED gives notices to  Actress Rakul preetsingh
రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఈడీ నోటీసులు

By

Published : Dec 16, 2022, 1:22 PM IST

Updated : Dec 16, 2022, 1:48 PM IST

13:18 December 16

రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఈడీ నోటీసులు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ సినీనటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గతేడాది సెప్టెంబర్‌ 3న రకుల్‌ను ఈడీ అధికారులు విచారించారు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని అప్పుడు విచారణ మధ్యలోనే రకుల్‌ వెళ్లిపోయారు. దీంతో ఈడీ అధికారులు ఆమెను పూర్తిస్థాయిలో విచారించలేకపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు హాజరుకావాలని తాజాగా ఈడీ అధికారులు రకుల్‌కు నోటీసులు జారీ చేశారు.

కాగా, డ్రగ్స్‌ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతేడాది ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు సిట్ ఏర్పాటు చేసి పలువురు టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, దర్శకుల్ని ప్రశ్నించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. వీరిలో పూరి జగన్నాథ్, చార్మి, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుపాటి రానా, ముమైత్ ఖాన్, నందు, తనీష్, తరుణ్, నవనీత్ తోపాటు పబ్ మేనేజర్ మేనేజర్, రవితేజ డ్రైవర్ శ్రీనివాసులు ఉన్నారు.

ఇదీ చూడండి:ప్రొఫెషనల్​ సింగర్​లా ఇంద్రజ​.. స్టేజ్ దద్దరిల్లేలా రష్మీ, సౌమ్య డ్యాన్స్​

Last Updated : Dec 16, 2022, 1:48 PM IST

ABOUT THE AUTHOR

...view details