Dunki Vs Salaar : డిసెంబర్ దగ్గర పడుతున్న కొద్దీ మూవీ లవర్స్‌లో ఉత్కంఠ మొదలవుతోంది. శీతాకాల సెలవులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పలు మూవీ మేకర్స్ కూడా తమ సినిమాలను విడుదల చేసేందుకు రంగంలోకి దిగారు. ఇందులో 'సలార్', 'డంకీ', 'హాయ్ నాన్న', 'ఎక్స్ట్రాడనరీ మ్యాన్', 'కెప్టెన్ మిల్లర్' ఆపరేషన్ మిల్లర్ లాంటి సినిమాలు ఉన్నాయి. అయితే అందరి దృష్టి మాత్రం ఇప్పుడు 'సలార్', 'డంకీ'పై పడింది. దీనికి కారణం ఈ రెండు జట్లు ఒకే రోజు రిలీజయ్యేందుకు సిద్ధమయ్యాయి.
వాస్తవానికి సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడి డిసెంబర్ 22న విడుదలయ్యేందుకు రెడీ అయ్యింది. అయితే అప్పటికే డంకీ సినిమా తమ విడుదల తేదీని ఖారారు చేసింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసింది. ఇలా పెద్ద సినిమాలు ఒకే తేదీని లాక్ చేయడం వల్ల బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయ్యే సూచనలు కనిపించాయి.
కానీ అనివార్య పరిస్థితుల్లో 'సలార్' పోటీ వచ్చి పడటం వల్ల 'డంకీ'కి సమస్య ఎదురైంది. దీంతో ఆ సినిమా రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ మొదలైంది. చూస్తుంటే 'డంకీ' వెనక్కి తగ్గే ఆలోచనలో కనిపించనప్పటికీ.. ప్రమోషన్లలో మాత్రం ఎక్కడా రిలీజ్ డేట్‌ను చెప్పకుండా జాగ్రత్త పడుతోంది. దీంతో పలు అనుమానాలకు తెరతీస్తున్నట్లు అయ్యింది. అయితే అనుకున్నట్లే డిసెంబర్ 21న డంకీ థియేటర్లలో రావడం ఖాయమని ఇటీవలే ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన టీజర్లో మాత్రం ఎక్కడా ఈ విషయాన్ని హైలైట్ చేయలేదు. దీంతో షారుక్ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో పడిపోయారు.
అయితే బీ టౌన్ వర్గాల సమాచారం ప్రకారం.. 'డంకీ' మూవీ టీమ్ ప్రస్తుతం రెండు డేట్లను పరిశీలిస్తోందట. తొలుత అనుకున్న ప్రకారం డిసెంబర్ 21న విడుదల చేయాలనుకుంటోందట. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ స్క్రీన్లలో షోలు వేసుకోవచ్చని వారి అభిప్రాయం. కానీ 'ఆక్వామెన్' కారణంగా ఓవర్ సీస్లో 'డంకీ'కి ఇబ్బందులు తలెత్తుతాయి. అంతే కాకుండా ఒకవేళ 'సలార్' బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఇక దక్షిణాది థియేటర్ కౌంట్ తగ్గిపోతుంది.