Dunki Opening Day Collection:'పఠాన్', 'జవాన్' సినిమాలతో వరుస హిట్లు అందుకున్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజాగా 'డంకీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'త్రీ ఇడియట్స్' ఫేమ్ రాజ్‌కుమార్ హిరానీ ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ అందుకుని థియేటర్లలో నడుస్తోంది. అయితే భారీ అంచనాలతో వచ్చినప్పటికీ ఈ చిత్రం మొదటి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేకపోయింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 'డంకీ' సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసులు చేసిందట. నెట్ కలెక్షన్స్ ప్రకారం ఇది రూ.30 కోట్లు క్రాస్ చేసిందని సమాచారం. దీంతో ఈ ఏడాది విడుదలైన 'గదర్ 2', 'పఠాన్' 'జవాన్', 'యానిమల్' ఓపెనింగ్స్ కంటే తక్కువగా సాధించిందట. పఠాన్ తొలి రోజు రూ.57 కోట్లు వసూలు చేసింది. ఇక జవాన్ రూ.74.50 కోట్లు, యానిమల్, రూ. 63 కోట్లు, గదర్ 2 రూ.40.1 కోట్లు కలెక్ట్ చేసింది.
మరోవైపు 'ఆదిపురుష్' సినిమా కంటే 'డంకీ' తక్కువ కలెక్షన్స్ అందుకుని సినీ వర్గాల టాక్. నెట్ కలెక్షన్స్ ప్రకారం 'ఆదిపురుష్' తొలి రోజు రూ.37 కోట్లు సాధించిందట. దీంతో బాలీవుడ్‌లో టాప్ కలెక్షన్స్ లిస్ట్‌లో 'డంకీ' 7వ స్థానంలో ఉంది.