Dulquer salman Sitaramam: దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా స్వప్న సినిమా పతాకంపై 'సీతారామం' చిత్రం తెరకెక్కుతోంది. మృణాళిని ఠాకూర్ కథానాయిక. ఇందులో 'అఫ్రీన్' అనే కీలక పాత్రలో రష్మిక మందన్న నటిస్తోంది. హను రాఘవపూడి దర్శకుడు. అశ్వినీదత్, ప్రియాంకదత్ నిర్మాతలు. తాజాగా ఈ సినిమాలోని అక్కినేని హీరో సుమంత్ పాత్రను పరిచయం చేస్తూ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సుమంత్ బ్రిగేడియర్ విష్ణుశర్మగా కనిపించారు. కోర మీసాలతో ఆర్మీ అధికారిగా ఆయన లుక్ బాగుంది. కాగా, ఈ మూవీలో సీత పాత్రలో మృణాళిని, లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నారు. దీన్ని తెలుగుతోపాటు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. సుమంత్, గౌతమ్ మేనన్, ప్రకాష్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం- పి.ఎస్.వినోద్, సంగీతం- విశాల్ చంద్రశేఖర్, కూర్పు- కోటగిరి వెంకటేశ్వరరావు, కళ- వైష్ణవిరెడ్డి, ప్రొడక్షన్ డిజైన్- సునీల్ బాబు అందిస్తున్నారు.
'సీతారామం' ఇంటెన్స్ లుక్.. దూసుకెళ్తున్న 'విక్రమ్' మేకింగ్ వీడియో - సీతారామం సుమంత్ లుక్
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న 'సీతారామం' చిత్రం నుంచి బ్రిగేడియర్‌గా నటిస్తున్న నటుడు సుమంత్ లుక్ వచ్చింది. మరోవైపు కమల్‌హాసన్ 'విక్రమ్' మేకింగ్ వీడియో సోషల్‌మీడియాలో దూసుకెళ్తోంది.
Vikram making video: కమల్‌హాసన్-లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హైఓల్టేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'విక్రమ్'. తాజాగా 'విక్రమ్' మేకింగ్ వీడియోని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసింది. ఫహాద్ ఫాజిల్ సన్నివేశాలతో ప్రారంభమైన ఈ మేకింగ్ వీడియో కమల్‌హాసన్, విజయ్‌సేతుపతి సీన్స్‌తో ఎంతో పవర్‌ఫుల్‌గా కొనసాగింది. ముఖ్యంగా కమల్ లుక్, డ్రెస్సింగ్ స్టైల్.. ఇలా ప్రతి చిన్న విషయంలో దర్శకుడు లోకేశ్ తీసుకున్న జాగ్రత్తలను ఈ వీడియోలో చూడొచ్చు. యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఆయన లుక్‌కు లోకేశ్ తుది మెరుగులు అద్దుతూ కనిపించారు. 6 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ లోకేశ్ ఫోకస్‌కు ఫిదా అవుతున్నారు. లోకేశ్‌ని మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. "లోకేశ్ సర్.. ప్రతిఫ్రేమ్‌లోనూ మీ ఫోకస్ అదిరిపోయింది", "ప్రతి సీన్‌ని తెరకెక్కించడంలో మీ టీమ్ పడిన కష్టం తెలుస్తోంది" అంటూ మెచ్చుకుంటున్నారు. మాదకద్రవ్యాల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకూ థియేటర్లలో అలరించిన ఈ సినిమా శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా అందుబాటులోకి వచ్చింది.
ఇదీ చూడండి: యాక్షన్ సీక్వెన్స్‌లో అలియా.. హాలీవుడ్ మూవీ వర్కింగ్ స్టిల్స్ లీక్