Dulquer salman Siraram movie: దుల్కర్ సల్మాన్ కథా నాయకుడిగా స్వప్న సినిమా పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'సీతారామం'. 'యుద్ధంతో రాసి ప్రేమకథ' ఉపశీర్షిక. మృణాళిని ఠాకూర్ కథానాయిక. ఇందులో 'అఫ్రీన్' అనే కీలక పాత్రలో రష్మిక మందన్న నటిస్తోంది. హను రాఘవపూడి దర్శకుడు. అశ్వినీదత్, ప్రియాంకదత్ నిర్మాతలు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5న థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలిపారు. "చరిత్రలోని ఓ ప్రేమకథ త్వరలోనే మీ ముందుకు రానుంది" అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. కాగా, సీత పాత్రలో మృణాళిని, లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. దీన్ని తెలుగుతోపాటు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. సుమంత్, గౌతమ్ మేనన్, ప్రకాష్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్.వినోద్-ఛాయాగ్రహణం,విశాల్ చంద్రశేఖర్- సంగీతం అందిస్తున్నారు.
Sivakarthikeyan Don movie collections: 'డాక్టర్' విజయంతో జోరుమీదున్న తమిళ హీరో శివ కార్తికేయన్... 'డాన్' చిత్రంతో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించారు. ఆయన ప్రియాంక మోహన్ జంటగా నటించిన చిత్రం 'డాన్'. కాలేజీ దశ నుంచి పెళ్లి వరకు ఓ యువకుడి జీవితంలో ఏమి జరిగిందో వినోదాత్మకంగా చూపించడమే ఈ చిత్ర కథ. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం విడుదలైన 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100కోట్ల కలెక్షన్లను అందుకుంది. ఈ విషయాన్ని మూవీటీమ్ ట్వీట్ చేస్తూ హర్షం వ్యక్తం చేసింది. కాగా, శిబి చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, సముద్రఖని ముఖ్యపాత్రల్లో కనిపించారు.