తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మరో తెలుగు సినిమాకు దుల్కర్​ గ్రీన్​ సిగ్నల్​.. ఈ సారి వెంకీ అట్లూరీతో - దుల్కర్​ సల్మాన్​ వెంకీ అట్లూరీ సినిమా

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్​ మరో తెలుగు సినిమాకు కమిట్ అయ్యారు. ఇటీవలే తమిళ స్టార్ హీరో ధనుశ్​తో 'సార్‌' సినిమాను రూపొందించి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరీతో మూవీ చేసేందుకు గ్రీన్​ సిగ్నల్ ఇచ్చారు.

Dulquer salman venky atluri
మరో తెలుగు సినిమాకు దుల్కర్​ గ్రీన్​ సిగ్నల్​

By

Published : May 14, 2023, 11:05 AM IST

Updated : May 14, 2023, 1:44 PM IST

Venky Atluri Dulquer Salman : మలయాళ మెగాస్టార్​ మమ్ముట్టి తనయుడిగా సిల్వర్​ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దుల్కర్‌ సల్మాన్​.. వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గర్తింపు తెచ్చుకున్నారు. జయపజయాలతో సంబంధం లేకుండా మలయాళం, తమిళ, హిందీ, తెలుగు.. ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. ఆయన ఏ భాషల్లో నటిస్తే అక్కడి ప్రేక్షకులు దుల్కర్​ను సొంతవాడిగా ఓన్ చేసుకుంటున్నారు. అయితే 'మాహానటి' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన రీసెంట్​గా 'సీతారామం' చిత్రంతో ఇక్కడ అభిమానుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆడియెన్స్​లో ఫుల్​ క్రేజ్‌తో పాటు ఇక్కడ కూడా మంచి మార్కెట్‌ను కూడా ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఆయన మరో తెలుగు సినిమాకు కమిట్​ అయ్యారు.

ఇటీవలే తమిళ స్టార్ హీరో ధనుశ్​తో 'సార్‌' సినిమాను రూపొందించి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరీతో మూవీ చేసేందుకు గ్రీన్​ సిగ్నల్ ఇచ్చారు. 'సార్​' సినిమాను నిర్మించిన సితార ఎంటర్​టైన్మెంట్స్​ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించనుంది. తాజాగా నిర్మాణ సంస్థ.. దుల్కర్​-అట్లూరీ కాంబో గురించి అధికారికంగా ప్రకటన చేసింది. ఈ మేరకు వెంకీ అట్లూరి, దుల్కర్‌ సల్మాన్‌, నాగవంశీ ముగ్గురు కలిసి దిగిన ఫోటోను పంచుకుంది. 'ఉబర్​ కూల్ ఈజ్​ బ్యాక్' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్‌ మీదకు వెళ్లనుందని తెలిపింది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పేర్కొంది. ఈ మూవీలో నటించనున్న మిగతా నటీనటులు, సాంకేతిక సిబ్బందికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. ఈ చిత్రం కోసం యూనివర్సల్ కాన్సెప్ట్ రెడీ చేశారని తెలిసింది. దుల్కర్​కు అన్ని భాషల్లో మంచి మార్కెట్​ ఉంది కాబట్టి.. పాన్​ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్​ చేసే అవకాశం ఉంది.

మరో తెలుగు సినిమాకు దుల్కర్​ గ్రీన్​ సిగ్నల్​

కాగా, దుల్కర్​.. ప్రస్తుతం కింగ్ ఆఫ్‌ కొత అనే మలయాళ సినిమా చేస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ సహా మరికొందరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్​ను.. దిగ్గజ సంస్థ 'సోనీ మ్యూజిక్' దక్కించుకుంది.

కింగ్ ఆఫ్‌ కొత మ్యూజిక్ రైట్స్ దక్కించుకున్న సోనీ

మంచి హిట్​ అవుతుందని.. 'సార్' సినిమాతో సూపర్​ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరీ.. దుల్కర్​ సల్మాన్​తో చేయబోయే చిత్రంతోనూ మెప్పిస్తారని సినీ ప్రియులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం కూడా మంచి క్వాలిటీ అండ్​ కంటెంట్ ఓరియెంటేడ్ సినిమాగా ఉంటుందని భావిస్తున్నారు. ఇకపోతే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ సంస్థ సంయుక్తంగా కలిసి.. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా ఓ సినిమా నిర్మిస్తున్నాయి. 'డీజే టిల్లు' హిట్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డతో 'టిల్లు స్క్వేర్' తెరకెక్కిస్తోంది. అలాగే సితార.. తన మాతృసంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్​పై సూపర్ స్టార్ మహేశ్​ బాబు-త్రివిక్రమ్​తోనూ ఓ సినిమా చేస్తోంది.

ఇదీ చూడండి:బాలయ్య వల్ల దెబ్బలు తిన్న అడివి శేష్​.. ట్రాన్స్‌ఫార్మర్‌ పేల్చేసిన ఎన్టీఆర్​!

Last Updated : May 14, 2023, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details