Dulquer Salmaan Prabhas Kalki Movie :రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కుతున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా.. ఇంటర్నెట్లో అది ట్రెండింగ్ అవుతుంది. తాజాగా ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. వాటిపై దుల్కర్ సల్మాన్ తాజాగా స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
దుల్కర్ సల్మాన్హీరోగా తెరకెక్కిన సినిమా 'కింగ్ ఆఫ్ కోథా'. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ .. 'కల్కి' సినిమా గురించి మాట్లాడారు. "నేను కల్కి సినిమాలో భాగమా.. కాదా.. అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను. కానీ.. నేను 'కల్కి' సెట్‌కు వెళ్లినప్పుడు ఆశ్చర్యపోయా. కేవలం దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రమే అంత గొప్పగా సినిమా తీయగలరు. అలాంటి ఆలోచనలు నాగ్ అశ్విన్‌కు మాత్రమే వస్తాయి. తన మొదటి సినిమా 'ఎవడే సుబ్రమణ్యం'కి అలాగే 'మహానటి' సినిమాకు సంబంధం ఉండదు. ఇప్పుడు 'కల్కి' కూడా అంతే.. చాలా కొత్తగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన కథగా కల్కి తెరకెక్కుతోంది." అని దుల్కర్ అన్నారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కాంబినేషన్‌లో మీకు సన్నివేశాలున్నాయా.. అని అడగ్గా.. 'అలాంటి విషయాలు మేకర్స్ మాత్రమే చెప్పాలి' అని దుల్కర్ జవాబు చెప్పకుండా తెలివిగా తప్పించుకున్నారు. ఈ సమాధానం విన్న దుల్కర్ అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్-దుల్కర్ సల్మాన్ కాంబో కోసం వెయిట్ చేస్తున్నామని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.