తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రజనీకాంత్ 'జైలర్​'.. కార్తి 'ఖైదీ'కి లింక్​.. ఏంటంటే? - రజనీకాంత్​ కార్తి సినిమాకు కనెక్షన్​

తమిళ హీరో కార్తి నటించిన 'ఖైదీ' సినిమా ఎంతలా హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా సీక్వెల్​ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఖైదీ మూవీ.. సూపర్​స్టార్ రజనీకాంత్ నటిస్తున్న​ కొత్త చిత్రం 'జైలర్'​కు ఓ కనెక్షన్ ఉందని తెలిసింది. అదేంటంటే..

Rajnikanth jailer connection
రజనీకాంత్ 'జైలర్​'.. కార్తి 'ఖైదీ'కి లింక్​.. ఏంటంటే?

By

Published : Jan 6, 2023, 4:08 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్​ సినిమా అంటే అభిమానులకు పండగే. ప్రస్తుతం ఆయన నుంచి రాబోతున్న కొత్త చిత్రం 'జైలర్'​. ఇందులో రజనీ.. ముత్తువేల్‌ పాండ్యన్​గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్​ కూడా విడుదలై ఫ్యాన్స్​ను ఆకట్టుకుంది. ఇందులో రజనీ.. కూల్​గా ఉంటూనే కత్తి పట్టుకుని నడుస్తూ కనిపించారు. బ్యాక్​గ్రౌండ్​ అంటా చీకటిలోనే ఉంది. అయితే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది.

అదేంటంటే.. ఈ చిత్రం కార్తి నటించిన సూపర్​ హిట్ సినిమా 'ఖైదీ' తరహాలోనే ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా అంతా కూడా ఒక్క రాత్రిలోనే జరిగిపోతుందట. 'ఖైదీ' చిత్రం మొత్తం ఒక్క రాత్రిలోనే జరిగినట్లు చూపించినా కథ, యాక్షన్​ పరంగా ఆడియెన్స్​కు బాగా ఆకట్టుకుంది. మరి ఇదే కాన్సెప్ట్​తో వస్తున్న 'జైలర్'​ ఎలా ఉంటుందో చూడాలి. కాగా, ఇప్పటికే బాగా హైప్‌తో రిలీజైన 'కబాలి', '2.0', 'పేట', 'అన్నార్తె' సినిమాలు పాజిటివ్​ టాక్​ తెచ్చుకున్నా రజనీకి ఉన్న క్రేజ్ స్థాయిలో హిట్టవ్వలేకపోయాయి. దీంతో ప్రస్తుతం రజనీ ఆశలన్నీ 'జైలర్‌' సినిమాపైనే ఉన్నాయి.

ఇకపోతే జైలర్​ మూవీలో రజనీతోపాటు శివ రాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ, యోగి బాబు, ప్రియాంక మోహన్​​ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. శివ కార్తికేయన్​ అతిథి పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి:నా భర్తతో పవిత్ర పెళ్లి జరగనివ్వను.. విడాకులు ఇవ్వను: నరేశ్ భార్య

ABOUT THE AUTHOR

...view details