తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పెళ్లి రూమర్స్​పై క్లారిటీ ఇచ్చిన దివ్యాన్షా.. మేమిద్దం మాట్లాడుకున్నది లేదంటూ..! - దివ్యాన్ష కౌశిక్ డేటింగ్​ రూమర్స్​

టాలీవుడ్​ హీరో నాగచైతన్యతో ఆమె రిలేషన్​లో ఉందని తర్వలో వీరిద్దరి పెళ్లి అంటూ వచ్చిన రూమర్స్​పై క్లారిటీ ఇచ్చారు మజిలీ బ్యూటీ దివ్యాన్ష కౌశిక్​. అయితే ఈ విషయంపై ఓ షాకింగ్​ స్టేట్​మెంట్​ ఇచ్చి ఫ్యాన్స్​ను ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఏమన్నారంటే..

divyansha kaushik clarifies about her marriage rumours
divyansha kaushik

By

Published : Jan 29, 2023, 3:42 PM IST

నాగచైతన్య 'మజిలీ' సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాఖండ్‌ బ్యూటీ దివ్యాన్ష కౌశిక్.. ఈ సినిమాలో నాగచైతన్యకు ప్రియురాలిగా నటించారు. ఈ క్రమంలోనే చైతన్యతో ఆమె రిలేషన్‌లో ఉందని, త్వరలోనే పెళ్లి అంటూ గతేడాది సోషల్​ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. "నాగచైతన్య అంటే నాకెంతో ఇష్టం. నా సీనియర్‌గా భావిస్తాను. వృత్తిపరంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటాను. మా ఇద్దరి గురించి అలాంటి రూమర్స్‌ నేను వినలేదు. ఈ మధ్యకాలంలో మేమిద్దరం మాట్లాడుకున్నది కూడా లేదు" అని వివరించారు.

అనంతరం తన సెలబ్రిటీ క్రష్‌ గురించి మాట్లాడుతూ.. "నాకు విజయ్‌ దేవరకొండ అంటే ఎంతో ఇష్టం. 'అర్జున్‌ రెడ్డి' చూసి ఆయనపై క్రష్‌ ఏర్పడింది. అయితే ఈ మధ్యకాలంలో అమ్మాయిలందరూ ఆయన్నే ఇష్టపడుతున్నారు. దాంతో నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు నా క్రష్‌ ఆదిత్య రాయ్‌ కపూర్‌" అని చెప్పారు. ఇక తన కెరీర్‌ విషయానికి వస్తే.. 'మజిలీ' తర్వాత 'ది వైఫ్‌', 'రామారావు ఆన్‌ డ్యూటీ' సినిమాల్లో దివ్యాన్ష మెరిసారు. అయితే ఈ రెండు సినిమాలకు మంచి టాక్​ వచ్చినప్పటికీ బాక్సాఫీస్​ వద్ద పేలవ ప్రదర్శన చూపెట్టాయి. తాజాగా సందీప్‌ కిషన్‌ 'మైఖేల్‌'లో నటించారు. ఫిబ్రవరి నెలలో ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details