తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'వకీల్​ సాబ్​' సీక్వెల్​పై​ డైరెక్టర్​ క్లారిటీ.. ఫ్యాన్స్​లో ఫుల్ జోష్​! - పవన్ కల్యాణ్​ వకీల్​ సాబ్ సీక్వెల్​

వకీల్​ సాబ్​ సీక్వెల్​పై మాట్లాడారు దర్శకుడు వేణు శ్రీరామ్​. ప్రస్తుతం స్క్రీప్ట్​ పనులు జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే అధికార ప్రకటన ఇస్తానని చెప్పారు. ఆ వివరాలు..

Director Venu Sriram confirmed about pawankalyan Vakeel Saab  sequel
'వకీల్​ సాబ్​' సీక్వెల్​పై​ డైరెక్టర్​ క్లారిటీ.. ఫ్యాన్స్​లో ఫుల్ జోష్​!

By

Published : Apr 10, 2023, 1:26 PM IST

పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ ఈ పేరు చాలు బాక్సాఫీస్​ బద్దలు అవ్వడానికి. సుదీర్ఘ కాలం నుంచి టాలీవుడ్​ ఇండస్ట్రీలో పవర్​స్టార్​గా రాణిస్తూ.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. అలాంటి సమయంలోనే ప్రజాసేవ అంటూ రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్​ ఇచ్చారు. దీంతో ఆయన అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే రాజకీయ సేవకు డబ్బులు అవసరమంటూ.. అందుకే మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్​లో మళ్లీ ఉత్సాహాన్ని నింపారు. అలానే బాలీవుడ్​ సూపర్​ హిట్​గా నిలిచిన 'పింక్​' తెలుగు రీమేక్​ 'వకీల్ సాబ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే అందరి దృష్టినీ ఆకర్షించింది. అలానే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది. బాక్సాఫీస్​ ముందు మంచి వసూళ్లను అందుకుంది. ముఖ్యంగా లాయర్​ పాత్రలో పవన్​ రీఎంట్రీ అభిమానులను ఎంతగానో ఉత్సాహపరిచింది. అలాగే ఓటీటీలోనూ విశేష ఆదరణను దక్కించుకుంది. రికార్డు స్థాయిలో వ్యూస్​ను దక్కించుకుంది. బుల్లితెరపైనా సత్తాను చాటింది. అయితే ఇప్పుడు సినిమాకు సీక్వెల్​ను ప్రకటించారు దర్శకుడు వేణు శ్రీరామ్​.

వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9వ తేదీకి విడుదలై రెండు సంవత్సరాలను పూర్తి చేసుకుంది. దీంతో నెటిజన్లతో సోషల్​మీడియా వేదికగా ముచ్చటించారు డైరెక్టర్ వేణు. ఈ సందర్భంగా 'వకీల్ సాబ్' మూవీ సీక్వెల్‌ గురించి మాట్లాడారు. కథను రెడీ చేస్తున్నట్లు తెలిపారు. "గతంలో నేను ప్రకటించిన సినిమా నిలిచిపోయింది. ప్రస్తుతం నేను మూడు స్క్రిప్టులకు పని చేస్తున్నాను. అందులో వకీల్ సాబ్ సీక్వెల్ కూడా ఉంది. ఇది ఫస్ట్ పార్ట్ కన్నా హైలైట్‌గా ఉంటుంది. ఇందులో పవన్ కల్యామ్​ ఎలివేషన్స్ మరింత హై రేంజ్‌లో ఉంటాయి. త్వరలోనే ఆయనతో చర్చింది మరిన్ని విషయాలు చెబుతాను" అని అన్నారు. దీంతో పవన్ కల్యాణ్​ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

కాగా, వకీల్ సాబ్ సినిమాను.. బీటౌన్​ ప్రొడ్యూసర్​ బోణీ కపూర్ సమర్పణలో తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ సెన్షేషన్​ సంగీతం అందించారు. ఇకపోతే 'వకీల్​ సాబ్'​ సినిమా తర్వాత భీమ్లానాయక్​తో వచ్చిన పవన్​.. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు', 'వినోదయం సీతం' రీమేక్, 'ఉస్తాద్ భగత్ సింగ్', 'OG' చిత్రాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఈ వారమే 'శాకుంతలం'.. 8 సినిమాలు 6 సిరీస్​లు.. మూవీ లవర్స్​కు ఇక ఫుల్ ఎంటర్​టైన్మెంట్​!

ABOUT THE AUTHOR

...view details