ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. ఈ మూవీ ఇండియన్స్ బాక్సాఫీస్ ముందు భారీ హిట్‌ను అందుకుంది. అయితే కొద్దిరోజుల క్రితం డైరెక్టర్ తేజ.. పుష్ప సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేశారని ప్రచారం సాగింది. అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారో మరోసారి వివరించారు.
పుష్ప సినిమా గురించి నేనలా అనలేదు: డైరెక్టర్ తేజ - దర్శకుడు తేజ కామెంట్స్ వైరల్
'పుష్ప' సినిమాపై గతంలో తాను అన్న వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు దర్శకుడు తేజ. ఏమన్నారంటే..
"పుష్ప మంచి సినిమా. అదే సమయంలో ఏపీలో టికెట్ రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. దాని వల్ల సినిమాకు కలెక్షన్స్ అనుకున్నంతగా రాలేదు. నష్టాలు వచ్చాయి. అదే టికెట్ రేట్ సరిగ్గా ఉంటే.. మంచి కలెక్షన్స్ వచ్చేవి. అదే ఓ యావరేజ్ సినిమా ఉంది. ఆ సినిమాకు టికెట్ రేట్స్ పెరిగాయి. అది హిట్ లెవల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. అంటే టికెట్ రేట్ వల్ల హిట్ సినిమా పుష్పకు.. ఫ్లాప్ సినిమాలా కలెక్షన్స్ తక్కువగా వచ్చాయి. అదే టికెట్ రేట్ బాగుండటం వల్ల, ఓ బాగోలేని సినిమాకు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. సినిమా బాలేదని చెప్పలేదు. నష్టం వచ్చిందని చెప్పాను. మరో విషయం ఏంటంటే సుకుమార్ నా ఫేవరేట్ డైరెక్టర్. తను ఎలాంటి సినిమా తీసినా నాకు నచ్చుతుంది. తనని, తన సినిమాలను తక్కువ చేసిన మాట్లాడను. కొంత మందికి నేను చెప్పింది అర్థం కాకపోవచ్చు. కళలకు ఇవన్నీ అడ్డం రాకూడదు. డబ్బులు, ఇగోలు ప్లే చేయకూడదు. ఓ సినిమా హిట్, ఫ్లాప్ అని చెప్పే అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను అన్ని హిట్ సినిమాలు తీయలేదు. అలాగని అన్నీ ఫ్లాప్ సినిమాలూ తీయలేదు. ఇక్కడెవ్వరూ మేధావులు కాదు." అని అన్నారు.
ఇదీ చూడండి: ఆ విషయంలో చాలా బాధపడ్డా: శ్రుతిహాసన్