ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి గాయపడ్డారు. ఆయన ఎడమకాలికి గాయమైంది. ఆయన తెరకెక్కిస్తున్న 'ఏజెంట్' మూవీ షూటింగ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆయన్న ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే సురేందర్ గాయానికి చికిత్స చేయించుకొని తిరిగి వెంటనే సెట్లో అడుగుపెట్టి చిత్రీకరణను కొనసాగించారు. గాయంతో బాధపడుతూనే కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.
'ఏజెంట్' షూటింగ్లో గాయపడ్డ దర్శకుడు సురేందర్.. ఆస్పత్రికి తరలింపు! - గాయపడ్డ దర్శకుడు సురేందర్
'ఏజెంట్' మూవీ షూటింగ్లో దర్శకుడు సురేందర్ రెడ్డి గాయపడ్డారు. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందంటే?
కాగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'ఏజెంట్'లో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండడంతో ఫ్యాన్స్‌కు ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తోంది. మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలవ్వనుంది. స్పై థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇదీ చూడండి:షూటింగ్లో గాయపడ్డ స్టార్ డైరెక్టర్.. కార్ ఛేజింగ్ సీన్స్ తెరకెక్కిస్తూ..