'రంగస్థలం'.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్-రామ్‌చరణ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. నటన పరంగా చరణ్‌ను ఓ మెట్టు ఎక్కించింది. ఈ చిత్రంలో అతడు పోషించిన చిట్టిబాబు పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో చిట్టిబాబుతో పాటు నటన పరంగా అనసూయ, సమంత కూడా తన పాత్రలతో విశేష ఆదరణను అందుకున్నారు.
అయ్యో.. అనుపమకు సూపర్ ఛాన్స్ మిస్.. ఆ ఆఫర్‌తో మరో హీరోయిన్ స్టార్ స్టేటస్ డబుల్! - 18 పేజన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్
హీరోయిన్ అనుపమకు సూపర్ ఛాన్స్ మిస్ అయింది. ఆ అవకాశాన్ని అందుకున్న మరో ముద్దుగుమ్మ.. ఆ ఛాన్స్‌తో మరింత స్టార్ స్టేటస్‌ను అందుకుంది. ఆ సంగతులు..
అయితే అసలు విషయానికొస్తే.. సినిమా విడుదలయ్యే వరకూ కొన్ని విషయాలను దాచి పెడుతుంటారు దర్శకులు, నటులు. డైరెక్టర్ సుకుమార్ కూడా రంగస్థలం మూవీ గురించి ఇప్పటివరకు అదే చేసి.. తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఈ చిత్రంలో సమంత.. రామలక్ష్మీ రోల్‌ను పోషించింది. ఈ పాత్రలో సామ్‌ను.. పల్లెటూరి అమ్మాయి ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు సుకుమార్. అలానే సామ్ కూడా ఆ క్యారెక్టర్లో ఇట్టే ఒదిగిపోయి నటించింది. పెళ్లి తర్వాత తనకొచ్చిన ఈ ఆఫర్‌ను ఎంతో సునాయాసంగా చక్కగా చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంది. అయితే ఈ ఆఫర్ సామ్ కంటే ముందు మరో ముద్దుగుమ్మను వరించిందట. కానీ ఆమెను కాదనుకున్న దర్శకుడు ఆ ఛాన్స్ సమంతకు ఇచ్చారట. ఇంతకీ ఆమె ఎవరో కాదు మన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. అసలు సుక్కు అనుపమను ఎందుకు వద్దన్నారంటే..
తాజాగా నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ నటించిన 18 పేజెస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య సుకుమార్ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ ఈ విషయాన్ని బయటపెట్టారు. "రంగస్థలానికి మొదట అనుపమను ఎంపిక చేసి ఆడిషన్స్‌కు పిలిచాము..అయితే ఆడిషన్స్ జరుగుతున్నంత సేపు అనుపమ భయంతో తన తల్లి వంక చూస్తూ ఉండేది. ఈ విషయాన్ని గమనించి నేను భయపడి ఆమె స్థానంలో సమంతను ఎంపిక చేశాను" అని తెలిపారు. అయితే అనుపమ ఓ గొప్ప నటి అని కచ్చితంగా తనతో ఓ సినిమా తీస్తానని సుకుమార్ అన్నారు.