తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రామ్​చరణ్​ 'RC15'లో స్టార్​ డైరెక్టర్​.. యుద్ధ వీరుడిగా హీరో సూర్య! - హీరో సూర్య లేటేస్ట్​ ఫోటో

హీరో రామ్​చరణ్​ నటిస్తున్న RC 15 సినిమాలో తమిళ దర్శకుడు, నటుడు ఎస్​జే సూర్య.. కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. మరోవైపు, సూర్య 42వ చిత్రానికి సంబంధించిన మోషన్​ పోస్టర్​ను మేకర్స్ విడుదల చేశారు. వీటితో పాటు మరికొన్ని అప్డేట్స్​ మీకోసం..

tollywood updates
tollywood updates

By

Published : Sep 9, 2022, 3:48 PM IST

Updated : Sep 9, 2022, 3:53 PM IST

Tamil Director SJ Surya In RC 15 Movie: రామ్‌చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. #RC15గా ఇది ప్రచారంలో ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి శుక్రవారం ఓ సరికొత్త అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ప్రముఖ నటుడు ఎస్‌జే సూర్య ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తోన్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో ఆయన పాత్ర ఎంతో కీలకంగా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుంది. పూర్తిస్థాయి రాజకీయ కోణంలో సాగే కథ ఇది. శ్రీకాంత్‌, అంజలి ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. కార్తిక్‌ సుబ్బరాజు ఈ చిత్రానికి కథ అందించారు.

స్టార్​ డైరెక్టర్​, నటుడు ఎస్​జే సూర్య

పది భాషల్లో సూర్య చిత్రం..!
సూర్య- శివ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. సూర్య 42వ చిత్రంగా ఇది రానుంది. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించనున్నారు. తాజాగా ఈసినిమా మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. చారిత్రక కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు పోస్టర్‌ చూస్తే తెలుస్తోంది. ఇందులో సూర్య పోరాట యోధుడిగా కనిపించారు. సుమారు 10 భాషల్లో, 3డీ వెర్షన్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

మంచు విష్ణు 'జిన్నా' టీజర్​​..
హీరో మంచి విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్ సూర్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన గ్లింప్స్‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది. తాజాగా మేక‌ర్స్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. విష్ణుకు జోడీగా పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టించారు. అవ ఎంట‌ర్టైన‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

'అహింస' సర్‌ప్రైజ్‌ ఇది..!
రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్‌ హీరోగా వెండితెరకు పరిచయం కానున్న చిత్రం 'అహింస'. తేజ దర్శకుడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తైంది. ఈ నేపథ్యంలో తాజాగా 'అహింస' ఫస్ట్‌ గ్లింప్స్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. ఇందులో అభిరామ్‌ను కొంతమంది కిడ్నాప్‌ చేసినట్లు చూపించారు. కిడ్నాపర్ల నుంచి ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లు ఈ వీడియోలో చూపించారు. ఆర్‌.పి.పట్నాయక్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

ఇవీ చదవండి:నటి అమలాపాల్​ రెండో పెళ్లి చేసుకున్నారా? నిజమేనా?

కమల్ మూవీ షూటింగ్​కు బ్రిటన్​ రాణి.. ఏ సినిమా అంటే?

Last Updated : Sep 9, 2022, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details