Director Shankar-Cricketer Suresh Raina Doctorate: చెన్నైలో జరిగిన కళాశాల స్నాతకోత్సవంలో మాజీ క్రికెటర్ సురేశ్ రైనా, ప్రముఖ దర్శకుడు శంకర్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వీరిద్దరికీ గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు. పల్లవరంలోని వీఈఎల్ఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 12వ స్నాతకోత్సవంలో విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు అందించారు.
దర్శకుడు శంకర్, క్రికెటర్ సురేశ్రైనాకు గౌరవ డాక్టరేట్ - దర్శకుడు శంకర్‌కు డాక్టరేట్
మాజీ క్రికెటర్ సురేశ్ రైనా, ప్రముఖ దర్శకుడు శంకర్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వీరిద్దరికీ గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు.
దర్శకుడు శంకర్, క్రికెటర్ సురేశ్రైనాకు గౌరవ డాక్టరేట్
చెన్నై చెస్ ఒలంపియాడ్‌లో పాల్గొన్నవారికి ఈ సందర్భంగా సురేశ్ రైనా అభినందనలు తెలిపారు. చెన్నైకి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ గౌరవ డాక్టరేట్ తనకు మరింత ప్రోత్సాహాన్ని అందించిందని దర్శకుడు శంకర్ తెలిపారు. మరిన్ని మంచి సినిమాలు చేయడానికి స్ఫూర్తిని కలిగించిందని చెప్పారు.
ఇదీ చూడండి:బింబిసార- సీతారామం బ్యూటీస్ హెవీ వర్కౌట్స్.. చెమటలు పట్టిస్తున్నారుగా!