బాలీవుడ్ అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్‌లో ఓ వెబ్‌సిరీస్ షూటింగ్ కోసం వచ్చిన రోహిత్.. చిత్రీకరణ సమయంలో గాయపడినట్లు తెలుస్తోంది. కారు ఛేజింగ్ సన్నివేశాల్ని తెరకెక్కించేటప్పుడు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం అందింది. ఆయన చేతికి బాగా గాయాలు అయినట్లు తెలిసింది. వెంటనే ఆయన్ను కామినేని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మైనర్ సర్జరీ చేశారని సినీ వర్గాలు తెలిపాయి.
కాగా, యాక్షన్ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు రోహిత్ శెట్టి.. ప్రస్తుతం పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' రూపొందిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్ర ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. కబీర్ మాలిక్ అనే శక్తిమంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో సిద్ధార్థ్ కనిపించనున్నాడు. ఈ వెబ్‌సిరీస్ షూటింగ్‌లోనే రోహిత్ గాయపడ్డారు.