తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'హ్యాట్సాఫ్​ బన్నీ-సుకుమార్​.. మీకు నేను ఫిదా అయిపోయా'

Puhpa Rajkumar hirani: 'పుష్ప' చిత్రం చూసిన ప్రముఖ దర్శకుడు రాజ్​కుమార్​ హిరాణీ.. దర్శకుడు సుకుమార్​పై ప్రశంసలు కురిపించారు. బన్నీ నటన, సాంగ్స్‌, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగున్నాయని పేర్కొన్నారు. సుక్కును తాను కలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

Puhpa Rajkumar hirani
సుకుమార్​ రాజ్​కుమార్ హిరాణీ

By

Published : Jun 11, 2022, 12:42 PM IST

Puhpa Rajkumar hirani: "పుష్ప సినిమా విడుదలైన తర్వాత.. ప్రతి దర్శకుడు సుకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఆయన వద్ద నుంచి సినిమాని తెరకెక్కించడంలో కొత్త టెక్నిక్స్‌ నేర్చుకుంటారు. అలా కనుక జరగకపోతే.. మైత్రి ఆఫీస్‌లో చొక్కా విప్పి తిరుగుతా".. 'పుష్ప' విడుదల ముందు రోజు జరిగిన ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్‌ చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడిదే మాటలను సినీ ప్రియులు గుర్తు చేసుకుంటున్నారు. బన్నీ చెప్పింది నిజమే అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే...

'పుష్ప' విడుదలైన నాటి నుంచి భారతదేశ చిత్రపరిశ్రమలోని చాలామంది ప్రముఖులు ఈ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బన్నీ, సుకుమార్‌ని పొగడ్తలతో ముం చెత్తుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, 'మున్నాబాయ్‌ ఎంబీబీఎస్‌', 'త్రీ ఇడియట్స్‌', 'పీకే', 'సంజు' వంటి చిత్రాలు తెరకెక్కించిన రాజ్‌కుమార్‌ హిరాణీ.. సుకుమార్‌ వర్క్‌ను ప్రశంసించారు. సుకుమార్‌ నంబర్‌ తెలుసుకుని ప్రత్యేకంగా మెస్సేజ్‌ పంపించారు. "గుడ్‌ మార్నింగ్‌ సుకుమార్‌ జీ.. నేను రాజు హిరాణీ. 'పుష్ప' సినిమా చూసిన నాటి నుంచి మీకు మెస్సేజ్‌ చేయాలనుకుంటున్నా. కాకపోతే మీ నంబర్‌ నా వద్ద లేదు. నిన్ననే నేను మహవీర్‌ జైన్‌ని కలిశా. ఆసమయంలో మేమిద్దరం మీ గురించే మాట్లాడుకున్నాం. అలా, నాకు మీ నంబర్‌ దొరికింది. 'పుష్ప'ని మీరు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. మీ సినిమా గురించి నేను ఎంతోమందితో చెప్పాను. నేను చెప్పే విధానం చూసి నాకేదో అయ్యిందన్నట్లు వాళ్లు ఆశ్చర్యపోయారు. కథ.. ఒక సీన్‌ని మించి మరొక సీన్‌ని మీరు తెరకెక్కించిన విధానం అదిరింది. బన్నీ నటన, సాంగ్స్‌, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగున్నాయి. గ్రేట్‌ ఎంటర్‌టైనర్‌. ఎంజాయ్‌ చేశా. మీరు ఇలాగే అత్యద్భుతమైన చిత్రాలు తెరకెక్కించాలి. మిమ్మల్ని ఒక్కసారి కలవాలనుకుంటున్నా. ఎప్పుడైనా మీరు ముంబయికి వస్తే తప్పకుండా నాకు ఒక్కసారి ఫోన్‌ చేయండి" అని హిరాణీ మెస్సేజ్‌ చేశారు.

హిరాణీ మెస్సేజ్‌పై స్పందించిన సుక్కు.. "మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌గా చెప్పుకునే మీ నుంచి సందేశం రావడం నాకెంతో ఆనందంగా ఉంది. మీరు పంపించిన మెస్సేజ్‌ని నా స్నేహితులందరికీ ఫార్వర్డ్‌ చేయడం వల్ల మీకు రిప్లై ఆలస్యంగా ఇస్తున్నాను. ఫిల్మ్‌ మేకింగ్‌, కథ రాయడంలో మీరు నాకెంతో స్ఫూర్తి" అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ మెస్సేజ్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు ఆరోజు బన్నీ చెప్పిన మాట నిజమైందని గుర్తు చేసుకుంటున్నారు.

ఇదీ చూడండి:జస్టిన్​ బీబర్​కు అరుదైన వ్యాధి.. ఆందోళనలో ఫ్యాన్స్​

ABOUT THE AUTHOR

...view details