తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఎన్టీఆర్​ చేసిన పనికి షాక్​ అయిన జక్కన్న.. ఇంతకీ తారక్ ఏం చేశాడంటే? - ఎన్టీఆర్​పై రాజమౌళి ప్రశంసలు

జూనియర్​ ఎన్టీఆర్ చేసిన ఓ పనికి తాను షాక్ అయినట్లు తెలిపారు దర్శకధీరుడు రాజమౌళి. తారక్​ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఏం అన్నారంటే..

NTR Rajamouli
ఎన్టీఆర్​ చేసిన పనికి షాక్​ అయిన జక్కన్న

By

Published : Nov 16, 2022, 2:59 PM IST

జూనియర్​ ఎన్టీఆర్​పై దర్శకుడు రాజమౌళి మరోసారి ప్రశంసలు కురిపించారు. తారక్​ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన దర్శకత్వంలో రామ్​చరణ్​, ఎన్టీఆర్​ హీరోలుగా నటించిన ఆర్​ఆర్​ఆర్​ విడుదలై ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అన్ని దేశాల్లోనూ రికార్డు స్థాయిలో విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలోనే చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో తారక్​ గురించి రాజమౌళి మాట్లాడారు. ఎన్టీఆర్‌కు పనిపై ఉన్న నిబద్ధత, డాన్స్‌పై ఉన్న తపన చూసి తానెప్పుడూ ఆశ్చర్యపోతుంటానని తెలిపారు.

"తారక్‌ అద్భుతమైన డాన్సర్‌. తనకు ఎక్కువ సాధన చేయాల్సిన అవసరం కూడా లేదు. అయినా, ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ అప్పుడు ఎంతో కష్టపడ్డాడు. 12 గంటలు నిరంతరంగా షూటింగ్‌ చేశాక కూడా మళ్లీ రూమ్‌కు వెళ్లి మరసటి రోజు షెడ్యూల్‌ కోసం గంటల తరబడి సాధన చేసేవాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు అమితమైన గౌరవం ఉంది" అంటూ తారక్‌పై అభిమానాన్ని వెల్లడించారు రాజమౌళి.

కాగా, ఇటీవల ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని, తన తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథను రాసే పనిలో ఉన్నారని రాజమౌళి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త ఆర్‌ఆర్‌ఆర్‌ అభిమానుల్లో జోష్‌ నింపింది. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా ఎన్టీఆర్​ 30గా ప్రచారంలో ఉంది. తాజాగా విడుదలైన ఎన్టీఆర్‌ లుక్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనుంది.

ఇదీ చూడండి:ఏంటీ కృతి వేసుకున్న డ్రెస్ రూ.68 వేలా

ABOUT THE AUTHOR

...view details