దర్శకధీరుడు రాజమౌళిగురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చిత్ర సీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. పదేళ్ల క్రితం వరకు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిచయమైన ఆయన.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ఒక్కప్పుడు జక్కన్న ఏ పని లేకుండా ఖాళీగా తిరిగారని తెలుసా? అసలు ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు? ఆ ఒక్క ప్రశ్న ఆయన జీవితాన్ని మార్చిందని మీకు తెలుసా? వంటి విషయాల సమాహారమే ఈ కథనం..
సీరియల్‌తో ప్రారంభం..
రాజమౌళి తన సినీ జర్నీని మొదట యాడ్స్, ఆ తర్వాత సీరియల్‌తో ప్రారంభించారు. 'శాంతినివాసం' సీరియల్‌తో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత 2001లో వచ్చిన 'స్టూడెంట్ నంబర్ 1'తో సినీ డైరెక్టర్‌గా మారారు. అలా మొదటి ప్రయత్నంలోనే అదిరిపోయే సూపర్ హిట్‌ను అందుకుని గుర్తింపును సాధించారు. ఆ తర్వాత ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బాస్టర్ హిట్లను అందించారు.
అన్నీ హిట్లే..
ఆ తర్వాత ఇప్పటివరకు తన రెండున్నర దశాబ్దాల సినీ కెరీర్లో.. మొత్తం 12 చిత్రాలను తెరకెక్కించారు జక్కన్న. సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ చిత్రాలను రూపొందించారు. ఈ సినిమాలన్నీ ఒకదాన్ని మించి ఇంకోటి భారీ విజయాన్ని అందుకుంటూ రాజమౌళి స్థాయిని పెంచాయి. ఒక్కటి కూడా పరాజయాన్ని అందుకోలేదు. ఎంతో మంది హీరోలకు స్టార్‌డమ్‌ను అందించారు. అలానే పాన్ ఇండియా స్టార్స్‌గా తీర్చిదిద్దారు.
జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి ఆస్కార్ తెచ్చిన ఘనత..
మన దేశానికి ఎన్నో ఏళ్లుగా ఆస్కార్ ఓ కలగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. అలాంటిది ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును కూడా ఆయన తన ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెచ్చిపెట్టారు. ఈ సినిమా వరల్డ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సంగీత దర్శకుడు కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు.
వదిన రాకతో..
అప్పట్లో చెన్నైలో రోజూ కీరవాణిరికార్డింగ్ థియేటర్‌కు కల్యాణ్ మాలిక్‌తో కలిసి వెళ్లేవారు జక్కన్న. ఆ తర్వాత ఇంటర్ గట్టెక్కారు. అనంతరం మళ్లీ కొన్నాళ్లపాటు ఖాళీగానే ఉన్నారు. ఇక అదే సమయంలో కీరవాణికి పెళ్లైంది. వదిన శ్రీవల్లి వచ్చింది. ఆమె రాక జక్కన్న లైఫ్‌ను మార్చింది. 'అసలు లైఫ్‌లో ఏం చేద్దాం అనుకుంటున్నారు' అని శ్రీవల్లి ఓ సారి అడిగిన ప్రశ్నకు.. జక్కన్న దగ్గర సమాధానం లేదు. అప్పటి నుంచే లైఫ్‌ను సీరియస్‌గా తీసుకున్నారు జక్కన్న.
కీరవాణి కుటుంబ సభ్యులతో రాజమౌళి ఆ తర్వాత తండ్రి విజేయంద్రప్రసాద్ ప్రోత్సాహంతో కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యారు. క్రాంతికుమార్ దగ్గర కూడా సహాయకుడిగానూ కొంతకాలం కెరీర్‌ను నెట్టుకొచ్చారు. ఈ క్రమంలోనే రచయితగా విజయేంద్రప్రసాద్‌కు మంచి పేరు రావడం, ఆ తర్వాత తండ్రి దగ్గరే రాజమౌళి పనిచేశారు. ఈ క్రమంలోనే కథలను విన్నట్లుగా.. సినిమా తీసి తెరపై బాగా చూపించలేకపోతున్నారు దర్శకులు. తానైతే ఇంకా బాగా తీయొచ్చని కొన్నిసార్లు భావించి దర్శకుడిగా మారాలనుకున్నారు. అలా డైరెక్టర్ వృత్తి వైపు అడుగులేశారు.
అవార్డు ఫంక్షన్లో ఈ విషయాన్ని..
ఆర్ఆర్ఆర్సినిమాకు సంబంధించిన ఓ అవార్డు అందుకునే ఈవెంట్లోనూ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. మా అమ్మ పేరు రాజనేంద్రి. ఆమే తన ప్రతిభను గుర్తించిందని చెప్పారు రాజమాళి. సినీ రంగం వైపు వచ్చేలా చేసిందని చెప్పుకొచ్చారు. 'వదిన శ్రీవల్లి నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంద'ని వదిన గురించి గొప్పగా చెప్పారు.