తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కెరీర్​లోనే నాని బెస్ట్ పెర్ఫామెన్స్​.. కీర్తి అదుర్స్​'.. 'దసరా'పై జక్కన్న రివ్యూ! - దసరా సినిమాపై డైరెక్టర్​ రాజమౌళి కామెంట్స్​

దర్శకుడు రాజమౌళి 'దసరా' నానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

rajamouli comments on dasara nani movie
దసరా సినిమాపై డైరెక్టర్​ రాజమౌళి ప్రశంసలు

By

Published : Apr 3, 2023, 6:55 PM IST

Updated : Apr 3, 2023, 7:42 PM IST

టాలీవుడ్​ దర్శక దిగ్గజం రాజమౌళి 'దసరా'లో నటించిన నేచురల్​ స్టార్​ నానిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాతో నాని తన కెరీర్​లోనే అత్యుత్తమమైన నటనను ప్రదర్శించాడని కొనియాడారు. హీరోయిన్​ కీర్తి సురేశ్​​ కూడా వెన్నెల క్యారెక్టర్​లో ఒదిగిపోయి అవలీలగా నటించందంటూ మెచ్చుకున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. వాస్తవ ప్రపంచంలో పాత్రల మధ్య హృదయానికి హత్తుకునే ఓ గొప్ప లవ్ స్టోరీని తెరకెక్కించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించారు రాజమౌళి. అద్భుతమైన విజయాన్ని అందుకున్న దసరా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. స్నేహం, ప్రేమ, పగల నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.87 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

మరోవైపు హీరో ప్రభాస్ కూడా దసరా సినిమా బాగుందంటూ మెచ్చుకున్నారు. చిత్ర బృందం అద్భుతంగా పనిచేసిందని.. దసరా లాంటి మరెన్నో చిత్రాలు మనం ప్రేక్షకులకి అందించాలని ఇన్​స్టా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు హీరో ప్రభాస్​. "దసరా చిత్రం చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చేసింది. నాని ఇలాంటి చిత్రం చేసినందుకు కంగ్రాట్స్. నటినటులు నాని, కీర్తి సురేశ్​, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, మూవీటీమ్​.. ప్రతిఒక్కరి పనితీరు అద్భుతంగా ఉంది. మనం ఇలాంటి చిత్రాలు మరిన్ని చేయాలని ఆశిస్తున్నా" అంటూ సినిమాపై ప్రభాస్ ప్రశంసలు కురిపించారు.

'దసరా'తో ఎన్టీఆర్​ రికార్డ్​ బ్రేక్​..
ఈ సినిమాతో ఓవర్సీస్​లోనూ ఓ మైలురాయిని అందుకున్నారు నాని. అది కూడా జూనియర్ ఎన్టీఆర్​ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. ప్రస్తుతం మీడియం రేంజ్​ హీరోల్లో నెంబర్​ 1గా ఉన్న నాని.. ఏకంగా స్టార్​ హీరోల లిస్ట్​లో టాప్​-3లోకి దూసుకొచ్చేశారు. ఓవర్సీస్ మార్కెట్​ కలెక్షన్స్​ పరంగా నాని నటించిన 8 సినిమాలు 1 మిలియన్ డాలర్ల మార్క్​ను అందుకున్నాయి. తాజాగా 'దసరా' చిత్రం కూడా 1 మిలియన్​ డాలర్ల కలెక్షన్లు సాధించిన సినిమా జాబితాలోకి చేరింది.

ఇప్పటికే ఏడు సార్లు ఈ రేర్ ఫీట్​ను అందుకున్న నాని.. తాజా చిత్రంతో ఎనిమిదో సారి కూడా ఆ ఘనతను సాధించారు. గతంలో నాని నటించిన 'ఈగ', 'నేను లోకల్', 'భలే భలే మగాడివోయ్', 'ఎంసీఏ', 'నిన్ను కోరి', 'జెర్సీ', 'అంటే సుందరానికి!' చిత్రాలు 1 మిలియన్ డాలర్ల మార్క్​ను దక్కించుకున్నాయి. టాలీవుడ్ నుంచి ఎక్కువ సార్లు 1 మిలియన్ డాలర్ల సినిమాలు అందించిన హీరోగా 7 సినిమాలతో మొదటి స్థానంలో జూ.ఎన్టీఆర్​ ఉండగా.. తాజా ఘనతతో 8 సినిమాలతో నాని రెండో హీరోగా నిలిచారు. 11 సినిమాలతో మొదటి స్థానంలో సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు కొనసాగుతున్నారు.

నాని నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం 'దసరా'. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్​గా అలరించింది. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న మొత్తం 5 భాషల్లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్​ వైడ్​గా దాదాపు 3 వేలకుపైగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. రిలీజైన మొదటి​ రోజు నుంచే తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ధరణి పాత్రలో నాని, వెన్నెల క్యారెక్టర్​లో కీర్తిసురేశ్ యాక్టింగ్​ అద్భుతం అంటూ ఇటు అభిమానులు అటు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Last Updated : Apr 3, 2023, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details