దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఏకంగా ఆస్కార్ అవార్డు రావడం వల్ల ఓ రెేంజ్లో గుర్తింపు సంపాదించుకున్నారు. హాలీవుడ్ దిగ్గజాలు సైతం జక్కన్నను కొనియాడారు. ఇప్పుడు అందరి దృష్టి.. ఆయన నెక్స్ట్ సినిమాపైనే ఉంది. ఇప్పటికే మన జక్కన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తదుపరి సినిమా ఉంటుందని అనౌన్స్ చేసేశారు. చేయటమే కాదు.. దానికి సంబంధించిన కథను రెడీ చేస్తున్నారు. దీనికి సంబంధించి తండ్రి, పాన్ ఇండియా రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్‌తో చర్చలు జరుపుతున్నారు.
ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు.. ఆస్కార్ అవార్డు వరించిన తర్వాత చేస్తున్న SSMB 29 మరో ఎత్తు. అందుకోసం రాజమౌళి భారీ స్కెచ్‌లు వేస్తున్నారు. ఏకంగా ఈసారి హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్‌తో పాటు టెక్నీషియన్స్‌తోనూ చేతులు కలుపుతున్నారు. ఇప్పటికే హాలీవుడ్ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ (CAA)తో అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ ప్రముఖ హాలీవుడ్ నటీనటులను ఈ సినిమాలో నటించడానికి ఒప్పిస్తుంది. దాంతో పాటు ఈ సినిమాలో థోర్ మూవీ యాక్టర్ క్రిస్ హెమ్స్ వర్త్ నటిస్తారనే టాక్ ఉంది.