Purijagannadh Chiru Godfater movie: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో దర్శకుడు పూరి జగన్నాథ్ నటించబోతున్నారని ఇటీవలే హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. అప్పుడీ విషయం బాగా ట్రెండ్ అయింది. అయితే అది ఏ చిత్రం అనేది చెప్పలేదు. దీంతో అందరూ బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌లో పూరి కనిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ మూవీ కాదని.. పూరి కనిపించేది 'గాడ్‌ఫాదర్' అని మళ్లీ ప్రచారం తెరపైకి వచ్చింది. ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారని మాట్లాడుకుంటున్నారు. అంతకుముందు కూడా ఈ చిత్ర కథ విషయంలో పూరి హస్తం కూడా ఉందని ప్రచారం సాగింది. ఇంతకీ పూరి ఏ మూవీలో నటిస్తున్నారో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఇక 'గాడ్‌ఫాదర్' విషయానికొస్తే.. మలయాళ హిట్ 'లూసిఫర్'కు రీమేక్‌గా ఇది రూపొందుతోంది. మాతృకలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను తెలుగులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేస్తుండటం విశేషం. లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్. సత్యదేవ్, సునీల్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
'గాడ్‌ఫాదర్' డబుల్ కాదు ట్రిపుల్ బొనాంజా.. 'కేజీఎఫ్ 2'లో 'సలార్' గ్లింప్స్! - చిరు గాడ్‌ఫాదర్‌లో పూరి జగన్నాథ్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'గాడ్‌ఫాదర్'లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌తో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా నటించనున్నారని తెలిసింది. ఇక 'సలార్' అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్ర టీజర్‌ను 'కేజీఎఫ్ 2' సినిమాకు జత చేస్తారని ప్రచారం సాగుతోంది.
Salaar teaser in KGF 2 movie: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పవర్‌ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా 'సలార్'. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచే వార్త ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. దీన్ని 'కేజీఎఫ్ 2'తో జత చేయాలని భావిస్తున్నారట. చిత్ర ఇంటర్వెల్లో దీన్ని ప్రసారం చేస్తారని తెలిసింది. ఇలా చేయడం వల్ల ఎక్కువ సంఖ్యలో కేజీఎఫ్ బుకింగ్స్ జరుగుతాయని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఏప్రిల్ 14వరకు ఆగాల్సిందే.
ఇదీ చూడండి: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కానీ అక్కినేని అభిమానులకు మాత్రం..