తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలయ్య షో ప్రోమో కోసం అంత బడ్జెట్టా? మరిన్ని రికార్డులపై 'అన్​స్టాపబుల్-2'​ గురి! - అన్​స్టాపబుల్ టాక్​ షో సీజన్​ 2

తెలుగు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ 'అన్​స్టాపబుల్'​ షో మళ్లీ వచ్చేస్తోంది. ఈసారి భారీ హంగులతో షో తీయనున్నారని తెలుస్తోంది. మంగళవారం షో ప్రోమో విడుదల కానున్న సందర్భంగా ప్రోమో దర్శకుడు ప్రశాంత్ వర్మ తన అనుభవాలను పంచుకున్నారు.

talk show unstoppable season 2
talk show unstoppable season 2

By

Published : Oct 3, 2022, 7:11 PM IST

Updated : Oct 4, 2022, 8:54 AM IST

తెలుగు వెండి తెర ఇలవేల్పు.. కలియుగ రాముడి ప్రత్యక్ష అవతారం.. అశేష ప్రజాదరణ పొందిన మహా నాయకుడు.. ప్రజా పాలకుడు ఆయన తండ్రి. అంతటి మహానుభావుడి నుంచి నటనను పునిపుచ్చుకుని.. తెలుగులో అగ్ర కథానాయకుల్లో ఒకరయ్యారు. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. నటనలో తండ్రిని మించిన తనయుడు.

ఆయన పేరు వింటే అభిమానుల రోమాలు నిక్కపొడుచు కుంటాయ్.. కళ్లు ఎర్రబడతాయ్​.. అభిమానంతో గొంతు బొంగురుపోతుంది అరిచి అరిచి. అయనే.. విశ్వ విఖ్యాత నటసార్వ భౌమ నందమూరి తారక రామారావు తనయుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ. వెండితెరను ఏలుతున్న ఆయన.. బుల్లితెరపైనా తనదైన శైలిలో మెరుస్తున్నారు. బాలయ్య హోస్ట్​గా చేస్తున్న అన్​స్టాపబుల్ షో సూపర్ హిట్ అయింది. అందుకే ఈ టాక్​ షోకు రెండో సీజన్ ప్లాన్​ చేశారు మేకర్స్​.

దీనికి సంబంధించి ఇటీవలే ఓ సాంగ్​ను రిలీజ్ చేశారు. దీనికి 'అన్​స్టాపబుల్ ఏంథమ్' అని పేరు పెట్టారు. ఈ పాటకు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్​ సంగీతం అందించగా.. ర్యాపర్​ రోల్​ రైడా లిరిక్స్ రాశారు. బాలకృష్ణ ఎనర్జీని మ్యాచ్​ చేస్తూ పాట సాగుతుంది. ఈ 'మ్యాన్ ఆఫ్​ ది మాసెస్'​ హీరోకు సెట్ అయ్యే ఈ పాటతో ఉర్రూతలూగుతున్నారు అభిమానులు.

అయితే తాజాగా ఈ టాక్ షో గురించి మరిన్ని విషయాలు తెలిశాయి. ఈ సీజన్​ 2 మామూలుగా ఉండదటండోయ్. ఒక సినిమా రేంజ్​లో తీస్తున్నారట. దానికి అంతే మొత్తంలో ఖర్చు చేస్తున్నారని సమాచారం. దీని కోసం సూపర్ హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ పని చేస్తున్నారు. ఈ విషయం స్వయంగా ఆ దర్శకుడే చెప్పాడు. ఈ షో గురించిన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

"బాలకృష్ణ టాక్​షో ప్రోమోను డైరెక్ట్ చేయమన్నప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఆయన నుంచి ఫ్యాన్స్​ ఏం కోరుకుంటున్నారో అదే ఇవ్వాలని అనుకున్నాం. ఎందుకంటే నేనూ ఆయన అభిమానినే. అయితే ఆహా టీమ్​ ఖర్చుకు వెనకాడకుండా ఈ ప్రోమోను చేశారు" అంటూ తన అనుభవాలను పంచుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అక్టోబర్ 4న అన్​ స్టాపబుల్ సీజన్​2 ప్రోమో విడుదల కానుంది. దీంతో అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి:Boxoffice war: ఈ వారమే గాడ్​ఫాదర్​-ఘోస్ట్​.. ఇంకా ఏ చిత్రాలు వస్తున్నాయంటే?​

వర్ష-ఇమ్మాన్యుయెల్ పెళ్లికి చీఫ్​ గెస్ట్​గా చిరు,నాగ్, పవన్​!

Last Updated : Oct 4, 2022, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details