తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

''సర్కారు వారి పాట'లో అసలు కథ అది కాదు..' - సర్కారు వారి పాట పరుశురామ్​

Sarkaru Vari Pata: మహేశ్‌తో పనిచేయడం ఎంతో స్ఫూర్తిని నింపిందని, ఆయన చాలా క్రమశిక్షణతో ఉంటారని దర్శకుడు పరుశురామ్​ అన్నారు. ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్​ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో పరశురామ్‌.. సినిమా గురించి అనేక ఆసక్తికర విశేషాలు తెలిపారు. అవి ఆయన మాటల్లోనే..

sarkaru vari pata
sarkaru vari pata

By

Published : May 2, 2022, 10:45 PM IST

Sarkaru Vari Pata: 'గీత గోవిందం' కంటే ముందే మహేశ్‌బాబు కోసం 'సర్కారువారి పాట' కథ రాశానని, అయితే అప్పుడు ఆయన్ను కలిసి కథ చెప్పాలా? వద్దా? అన్న సందిగ్ధంలో ఉండిపోయానని చెప్పుకొచ్చారు దర్శకుడు పరశురామ్‌. ఆయన దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న 'సర్కారువారి పాట'. కీర్తి సురేశ్‌ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరశురామ్‌ సినిమా గురించి అనేక ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

  • 'మీకొక కథ చెప్పాలి' అని అడగగానే మహేశ్‌ వెంటనే ఒప్పుకొన్నారు. ఒక రకంగా నాపై ఉన్న ఒత్తిడిని క్షణంలో మాయం చేశారు. అంతేకాదు, సినిమాలో ప్రతి పాత్రకూ ఆయన కనెక్ట్‌ అయ్యారు. దాదాపు గంటకు పైగా కథ వినిపించా. మొత్తం విని షేక్‌హ్యాండ్‌ ఇచ్చి, 'మనం ఈ సినిమా చేస్తున్నాం' అని చెప్పారు.
  • 'నా కెరీర్‌ గ్రాఫ్‌ చూసుకుంటే తొలి సినిమానే హిట్‌. ఆ తర్వాత రెండో మూవీ 'సారొచ్చారు' ఫ్లాప్‌. దాని నుంచి తేరుకోవడానికి రెండేళ్లు పట్టింది. అప్పటి నుంచి నా జర్నీ కొత్తగా మొదలు పెట్టా
  • 'సర్కారువారి పాట' బ్యాంకు నేపథ్యంలో సాగే కథ మాత్రమే. అయితే, బ్యాంకు కుంభకోణాలను కానీ, అందుకు సంబంధించిన అంశాలను ఇందులో చర్చించలేదు. కేవలం ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక క్రమశిక్షణ ఇలా కథాగమనంలో అనేక పార్శ్వాలు ఉంటాయి. అవన్నీ కథను అనుసంధానిస్తూ భావోద్వేగభరితంగా సాగుతాయి.'
  • 'ఈ సినిమాలో మహేశ్‌ పాత్ర ఫుల్‌ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అంతేకాదు, భావోద్వేగాల మిళితంగా సాగుతుంది. అదే సమయంలో తనదైన టైమింగ్‌తో కామెడీ పంచుతూ ప్రేక్షకులను అలరిస్తారు'
  • 'సర్కారు వారి పాట'లో మహేశ్‌బాబు పొడవాటి జుట్టుతో, మెడపై టాటూతో అలా స్టైల్‌గా కనిపించాలన్నది నా ఆలోచనే. ఆయన్ను చూడగానే 'వావ్‌' అనేలా ఉండేలా ఆ పాత్రను డిజైన్‌ చేసుకున్నా. ఈ విషయాన్ని మహేశ్‌కు చెప్పగానే చాలా ఉత్సాహం చూపారు. రెండు నెలల పాటు జుట్టు పెంచారు.
  • 'సెట్స్‌లో మహేశ్‌బాబు పూర్తి శ్రద్ధతో ఉంటారు. ప్రతి సీన్‌ బాగా వచ్చే వరకూ ఎలాంటి విసుగు, విరామం లేకుండా పనిచేస్తారు. మహేశ్‌ సూపర్‌స్టార్‌ ఎందుకు అయ్యారో ఆయనతో పనిచేసిన తర్వాతే నాకూ అర్థమైంది'
    'సర్కారు వారి పాట'
  • మహేశ్‌తో పనిచేయడం నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది. చాలా క్రమశిక్షణతో ఉంటారు. అదే సమయంలో కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాదు, ఆయన మాటల్లో కూడా చక్కటి హాస్యం ఉంటుంది.
  • మహేశ్‌బాబు నటించిన 'ఒక్కడు' చూసిన తర్వాత కెరీర్‌లో ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నా. అలా పూరి జగన్నాథ్‌ వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించా.

ABOUT THE AUTHOR

...view details