Director Maruti father died: ప్రముఖ దర్శకుడు మారుతి ఇంట్లో విషాదం జరిగింది. ఆయన తండ్రి కుచలరావు(76) కన్నుమూశారు. మచిలీపట్నంలోని తన నివాసంలో కుచలరావు తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, బంధుమిత్రులు మారుతికి ఫోన్ చేసి సంతాపం తెలుపుతున్నారు. కుచల రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు మారుతికి పితృవియోగం - ప్రభాస్ మారుతి సినిమా
Director Maruti father died: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారుతికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి కుచలరావు(76) తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ దర్శకుడు మారుతికి పితృవియోగం
కాగా, చివరిసారిగా 'మంచి రోజులు వచ్చాయి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మారుతి.. త్వరలోనే 'పక్కా కమర్షియల్' చిత్రంతో సినీప్రియులను అలరించనున్నారు. త్వరలోనే ప్రభాస్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. మరి కొద్ది రోజుల్లో అది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక టాలీవుడ్లో గత రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ప్రముఖ వ్యక్తులు కన్నుమూశారు. ప్రముఖ నిర్మాత నారంగ్, సీనియర్ దర్శకుడు తాతినేని స్వర్గస్తులు అయ్యారు.
ఇదీ చూడండి: ఆర్జీవీ X నట్టికుమార్.. 'కోర్టులోనే తేల్చుకుందాం'!
Last Updated : Apr 21, 2022, 8:21 AM IST