నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా అన్ స్టాపబుల్ రెండో సీజన్ ఆఖరి ఎపిసోడ్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన తొలి పార్ట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న రెండో పార్ట్ కూడా అదే తరహాలో ఫుల్ క్రేజ్ అందుకుంటోంది. అయితే ఈ ఎపిసోడ్‌కు త్రివిక్రమ్‌ను రావాలని బాలయ్య ముందుగానే కోరగా.. ఆయన వస్తాను అని చెప్పి ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలే పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే వారిద్దరిని కలిపి సెకండ్ పార్ట్ ఎపిసోడ్లో హైలెట్ చేయాలని అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ చివరి నిమిషంలో రాకపోవడంతో.. ఆయన ఎందుకు రాలేదో.. ఈ షోలో సందడి చేసిన క్రిష్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.
క్రిష్ ఈ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే... బాలయ్య 'మా ఇద్దరితో సినిమాలు చేశావు కదా ఇప్పుడు ఎలా ఉంది' అని అడిగారు. 'ఒక పులి, సింహం మధ్యలో నా తల ఉంది' అంటూ క్రిష్ భయపడుతూ(సరదాగా) సమాధానం ఇచ్చాడు. "అయితే షూటింగ్లో డైరెక్షన్ చేసినప్పుడు భయం అనిపించలేదు. కానీ ఇప్పుడు ఇలా కూర్చున్నందుకు మాత్రం కాస్త భయంగా ఉంది. త్రివిక్రమ్ గారు ఎందుకు రాలేదో ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ విధంగా ఇద్దరు నన్ను ర్యాగింగ్ చేస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. త్రివిక్రమ్ గారు చాలా తెలివిగా తప్పించుకున్నారు" అని చెప్పకనే చెప్పేశారు.