Director Harish Shankar Tweet Viral Raviteja : సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్‌గా ఉండే దర్శకుల్లో హరీశ్ శంకర్ ఒకరు. సినిమాలపైనే కాకుండా పలు సామాజిక అంశాలపైనా తన అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు నిర్మొహమాటంగా చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఆయన తాజాగా ట్విటర్ వేదికగా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.
"ఇక్కడ ఎవరికీ ఎవరిపైనా నెగెటివిటీ ఉండదు. ఒకవేళ ఉన్నా ఏదో ఒక శుక్రవారం ఎవరో ఒకరు దొరికేస్తారు. ఎవడైనా పక్కవాడి అపజయానికి సోలో డ్యాన్స్ వేస్తే, రేపు వాడి అపజయానికి గ్రూప్ డ్యాన్సర్లు సిద్ధం అవుతారు" అని మాస్ మహారాజా హీరో రవితేజ తనతో చెప్పారంటూ హరీశ్ రాసుకొచ్చారు. ఇలాంటి విశాల దృక్పథం ఉంది కాబట్టే రవితేజ అన్నయ్య ఎంతో ఆనందంగా ఉంటారని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు.
ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు - టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సినిమాల రిలీజ్కు ముందు, రిలీజ్కు తర్వాత నెలకొన్న పరిస్థితులను ఉద్దేశించి హరీశ్ శంకర్ ఈ ట్వీట్ రాసుకొచ్చారంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.