సతురంగ వెట్టై, థీరన్ అధిగరమ్ ఒండ్రు వంటి హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హెచ్ వినోద్. రీసెంట్గా హీరో అజిత్‌తో 'తునివు' సినిమా చేసి తమిళనాట బిగ్ సక్సెస్‌ను అందుకున్నారు. అంతకుముందు కూడా అజిత్‌తోనే ఆయన వరుసగా నేర్కొండ పార్వై, వలిమై చిత్రాలను చేసి ఆకట్టుకున్నారు. దీంతో ఆయన తదుపరి సినిమాతో ఎవరితో ఉండబోతుందా అనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది. ఈ క్రమంలోనే ధనుశ్, కమల్‌హాసన్, విజయ్ సేతుపతి పేర్లు వినిపించాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం కమల్‌హాసన్‌తో ఆయన సినిమా ఫిక్స్ అయిందని ప్రచారం సాగుతోంది.
KH233 వర్కింట్ టైటిల్‌తో త్వరలోనే ఈ మూవీ గురించి అధికార ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారని సమాచారం. ప్రస్తుతం కమల్ హాసన్.. శంకర్ డైరెక్షన్లో 'భారతీయుడు 2' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ ఏడాదిలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రం పూర్తయ్యాకే KH233 షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారట.