'వాల్తేరు వీరయ్య' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు బాబీ. చిరు అభిమాలనుకు మాస్ ఎంటర్‌టైనర్‌ను అందించిన ఈ డైరెక్టర్.. ప్రస్తుతం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా గన్నవరం విమానాశ్రయంలో బాబీ మీడియాతో మాట్లాడారు. 'వాల్తేరు వీరయ్య' సినిమాని హిట్ చేసినందుకు మరోసారి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
నా తర్వాతి సినిమా ఆ మెగా హీరోతోనే : డైరెక్టర్ బాబీ
వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న డైరక్టర్ బాబీ.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ సినిమా తీసిన ఈ దర్శకుడు.. ఇప్పుడు మరో మెగా హీరోను డైరక్ట్ చేసేందుకు రెడీగా ఉన్నారట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..
"మా సినిమా విడుదలై నాలుగు వారాలవుతున్నా.. ఇప్పటికీ కలెక్షన్లు బాగా వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు విదేశాల్లోని తెలుగు వారు కూడా ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. నా దర్శకత్వంలో నటించడానికి చిరంజీవి అంగీకరించడమే నాకు పెద్ద బహుమతితో సమానం. ప్రస్తుతం మా చిత్ర బృందం అంతా సినిమా విజయోత్సవ సంబరాల్లో ఉంది. మరో మెగా హీరోను డైరెక్ట్ చేయబోతున్నాను. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడిస్తాను" అని చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లతో సినిమాలు తీసిన బాబీ.. తర్వాత ఏ మెగా హీరోతో పనిచేస్తారా అని నెట్టింట్లో చర్చ మొదలైంది. 'ఆ మెగా హీరో వైష్ణవ్ తేజ్' అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు, బాబీ తర్వాత సినిమా రామ్‌చరణ్‌తో అని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు మరికొందరు నెటిజన్లు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే దాకా వేచి చూడాల్సిందే.