Chiranjeevi Aggression : మెగాస్టార్ చిరంజీవి- పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. బంధం గురించి భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బాబీ చెప్పిన తీరుకు మెగా అభిమానులంతా ఫిదా అవుతున్నారు. తన తమ్ముడు అలిగి వెళ్లిపోయాడని తెలుసుకుని.. క్షణాల్లో స్పందించి అవతల వ్యక్తికి చిరు వార్నింగ్ ఇచ్చారని బాబీ తెలిపారు. తమ్ముడిని ఒక్క మాట అన్నా.. అన్నయ్య ఊరుకోరు అంటూ చిరు-పవన్ బంధం గురించి చెప్పుకొచ్చారు. భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బాబీ ఇంతకీ ఏం చెప్పారంటే?
Director Bobby Speech : "చిరంజీవిగారికి నేను ఏం చెప్పగలను.. అన్నయ్యను దూరం నుంచి అభిమానించడం వేరు.. దగ్గరి నుంచి చూశాకా? అభిమాని అనే పెద్ద పదం ఏదైనా ఉందేమో అని వెతుకుతున్నాను.. వీరయ్య తరువాత నాకు గౌరవం పెరిగింది.. హైపర్ ఆది ఒక్కో మాట చెబుతుంటే.. స్టేజ్ మీదకు వచ్చి ఎత్తుకోవాలని అనిపించింది.. చిరంజీవి గారికి ఆవేశం, కోపంరాదు.. అంటారు.. కానీ ఓ సందర్భం చెబుతాను.. ఆయన్ను అంటే ఆయన మన్నిస్తారేమో.. ఓ చిన్న ఉదాహరణ చెబుతాను"
"పవన్ కల్యాణ్ గారిది ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది.. ఓ పెద్ద డాక్టర్ ఇంట్లో షూటింగ్ జరుగుతోంది.. లైట్ మెన్స్ షూలు వేసుకుని ఇంట్లో నడుస్తున్నారు.. ఇడియట్స్ గెట్ అవుట్ అంటూ ఓ ఓనర్ పెద్ద పెద్దగా అరుస్తున్నారట.. అది విని కల్యాణ్.. లోపలకు వచ్చి ఏమైంది అని గొడవ పెట్టుకున్నారు. వాళ్లను షూలు వేసుకోనివ్వకపోతే.. నేను షూటింగ్ చేయను.. వెళ్లిపోతాను అని పవన్ కల్యాణ్ అలిగి వెళ్లిపోయారు.. వేరే నిర్మాతల ద్వారా ఆ విషయం చిరంజీవి గారికి తెలిసింది. వెంటనే చిరంజీవి ఆ డాక్టర్‌కు ఫోన్ చేశారు.. సినిమా వాళ్లు కష్టపడతారని తెలిసే కదా ఇల్లు ఇచ్చింది.. డబ్బులు తీసుకుంటున్నారు కదా? మీ ఇంటి మీద అంత ప్రేమ ఉంటే.. షూటింగ్‌లకు ఇవ్వొద్దు.. రెంట్లు వసూల్ చేయొద్దు.. నా తమ్ముడి అలిగి వెళ్లి గంట అయింది కాబట్టి ఊరుకున్నా.. వెంటనే తెలిస్తే వచ్చి షూటింగ్ జరిపించేవాడ్ని.. అని ఆవేశంగా వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి గారూ ఉన్నారు.. తమ్ముడిని అంటే ఆయన ఊరుకోరు.. మనలాంటి తమ్ముళ్లని అన్నా ఆయన అస్సలు ఊరుకోరు" అంటూ బాబీ మాట్లాడాడు.
'చిరు క్షమిస్తే.. పవన్ వడ్డీతో తిరిగిచ్చేస్తాడు.. మెగా ఫ్యామిలీని ఎవడైనా అంటే కుర్చీ మడతపెట్టి..'
'భయంతోనే ఆ పని చేశా.. స్టోరీ మంచిదైతే రీమేక్ చేస్తే తప్పేంటి?'.. వారికి చిరు స్ట్రాంగ్ కౌంటర్!