Director B Gopal Balakrishna : సీనియర్ దర్శకుడు బి.గోపాల్ గుర్తున్నారా?.. టాలీవుడ్‌కు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. ఆయన ఈమధ్య యూట్యూబ్ ఛానెళ్లకు తెగ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తన వ్యక్తిగతమైన విషయాలతోపాటు కెరీర్లో ఎన్నో మధురానుభూతులను పంచుకుంటున్నారు. అన్నింటిలో ఆయన కామన్‌గా చెప్పే పాయింట్ మాత్రం ఒకటుంది. అదే బాలయ్యతో సినిమా.
తన ఫేవరెట్ హీరో బాలకృష్ణతో సినిమా తీసి రిటైర్అవుతానని బి.గోపాల్ ప్రకటించారు. ఆ మధ్య ఓ సినిమా ఫంక్షన్లో బాలయ్యతో బి.గోపాల్ కనిపించారు. అప్పట్నుంచి ఈ కాంబినేషన్‌పై మళ్లీ చర్చ మొదలైంది. ఆ తర్వాత పలు సందర్భాల్లో బి.గోపాల్ కూడా బాలకృష్ణతో సినిమా చేస్తానని చెబుతూ వస్తున్నారు.
"బాలయ్య కోసం ఓ స్టోరీ రెడీ చేస్తున్నాం. కథ ఫైనలైజ్ అయిన తర్వాత ఆయన డేట్స్ బట్టి సినిమా ఉంటుంది. అయితే దీనికి ఇంకా టైమ్ పడుతుంది. ఎందుకంటే మా కథ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇటు బాలయ్య కూడా బిజీగా ఉన్నారు. కథ పూర్తయి, దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినంత వరకు చెప్పలేం" అని బి.గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా బాలయ్యతో సినిమా చేస్తానని చెబుతూనే, ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నట్టు పరోక్షంగా వెల్లడించారు బి.గోపాల్.
సీనియర్ దర్శకుడు బి. గోపాల్ అయితే బాలకృష్ణ, బి.గోపాల్ది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీళ్లిద్దరి కాంబోలో లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కాయి. పల్నాటి బ్రహ్మనాయుడు తర్వాత బాలయ్యతో మళ్లీ సినిమా తీయలేదు బి.గోపాల్. దాదాపు 20 ఏళ్ల గ్యాప్ వచ్చేసింది.
ప్రస్తుతం బాలకృష్ణ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నారు. అది ఈ ఏడాది అక్టోబరు 19న విడుదల కానుంది. ఆ తర్వాత బాలయ్య.. డైరెక్టర్ బాబీతో సినిమా చేస్తారు. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయి. భగవంత్ కేసరి అయ్యాక.. బాలయ్య బాబీతో చేతులు కలపనున్నారు.
'భగవంత్ కేసరి' మేనియా అప్పటి నుంచే..
మరోవైపు, భగవంత్ కేసరి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్లు రానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు మూడో వారం నుంచి భగవంత్ కేసరి మేనియా స్టార్ట్ కానుందట. అక్కడ నుంచి నందమూరి ఫ్యాన్స్‌కు ఫీస్ట్ స్టార్ట్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. శరత్ కుమార్, శ్రీలీల తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ సినిమాస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.