దగ్గుబాటి, మెగా హీరోల కాంబినేషన్‌లో వచ్చిన పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఎఫ్-2'. మూడేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన నవ్వుల సునామీని ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ మర్చిపోరు. ఇప్పుడు ఇదే చిత్రానికి సీక్వెల్‌గా 'ఎఫ్-3' వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వేసవి కానుకగా మే 27న విడుదల కానుంది. అయితే, ఇటీవల స్టార్‌హీరోల చిత్రాలు విడుదలైన సమయంలో కొద్ది రోజులపాటు టికెట్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. దీంతో 'ఎఫ్-3'కి కూడా టికెట్ రేట్లు పెంచుతారా? అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. దీనిపై బుధవారం ఉదయం చిత్ర నిర్మాత దిల్‌రాజు ఓ ప్రకటన చేశారు.
‘ఎఫ్3’ టికెట్ రేట్ల పెంపుపై దిల్‌రాజు ఏమన్నారంటే? - dil raju interview
విక్టరీ వెంకటేశ్, వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎఫ్3’ సినిమా మే 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై కీలక ప్రకటన చేశారు నిర్మాత దిల్‌రాజు.
" 'ఎఫ్-3' చిత్రానికి టికెట్ రేట్లు పెంచడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మేము ఈ చిత్రాన్ని మీ ముందుకు తెస్తున్నాం" అని స్పష్టత ఇచ్చారు. దిల్‌రాజు ప్రకటనతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆనందిస్తున్నారు. డబ్బు, దాని వల్ల వచ్చే అనర్థాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో 'ఎఫ్-3' తెరకెక్కింది. వెంకీ, వరుణ్‌లకు జోడీగా తమన్నా, మెహ్రీన్‌లు నటించారు. మురళీ శర్మ, సోనాల్ చౌహాన్, సునీల్, అలీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు.
ఇదీ చదవండి:'నా ఇంటికి వచ్చే స్థాయి ఏ బాలీవుడ్ స్టార్‌కు లేదు'