తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Tollywood: నిర్మాతల మండలిలో మరోసారి విభేదాలు.. ఏం జరిగిందంటే? - టాలీవుడ్ ప్రొడ్యూసర్స్​ కౌన్సిల్

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. పలువురు నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్‌లో ఆందోళనకు దిగారు. ఏం జరిగిందంటే..

Producers Council
నిర్మాతల మండలిలో మరోసారి విభేదాలు

By

Published : Sep 24, 2022, 2:55 PM IST

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. గడువు ముగిసినా నిర్మాతల మండలికి ఎన్నికలు జరపడం లేదంటూ శనివారం ఉదయం పలువురు నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్‌లో ఆందోళనకు దిగారు. ప్రస్తుత అధ్యక్షుడు సి.కల్యాణ్ నియంతృత్వ ధోరణి వల్ల నిర్మాతల మండలిలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు.

ఎప్పటికప్పుడు ఎన్నికలు వాయిదా వేస్తూ సభ్యులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా నిర్మాతల మండలిలో సర్వసభ్య సమావేశాలు జరపడం లేదని, సభ్యులకు లెక్కలు చూపించడం లేదని ఆరోపించారు. వెంటనే నిర్మాతల మండలి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అవసరమైతే న్యాయపోరాటనికి కూడా దిగుతామని వారు తెలిపారు.

ఇదీ చూడండి: బాబాయ్​, అబ్బాయ్​ 'రానా నాయుడు'.. నెట్​ఫ్లిక్స్​లో యాక్షన్​ థ్రిల్లర్​

ABOUT THE AUTHOR

...view details