Hrithik Roshan Saba Azad: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్.. సింగర్ సబా ఆజాద్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు కొంత కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి గురించి తాజాగా మరో వార్త ఇప్పుడు బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ముంబయిలోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటోన్న వీరిద్దరూ త్వరలోనే కొత్తింటికి మకాం మార్చనున్నట్లు తెలుస్తోంది. ప్రియురాలితో కలిసి ఆహ్లాదకరంగా నివసించేందుకు.. బీచ్ వ్యూతో ఉన్న రెండస్తుల భవనాన్ని కొన్నట్లు సమాచారం. దీని ఖరీదు సుమారు రూ.100 కోట్లని ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. దీంతో వీరిద్దరి రిలేషన్ మరోసారి బీటౌన్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ప్రియురాలితో అలా ఉండేందుకు రూ.100 కోట్లు ఖర్చు పెట్టిన హృతిక్! - హృతిక్ రోషన్ సబా ప్రేమకథ
బాలీవుడ్ నటి సబా ఆజాద్‌తో రిలేషన్‌లో ఉన్నారు నటుడు హృతిక్ రోషన్. త్వరలో వీరిద్దరూ కొత్త ఇంటిలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఇంటికి కోసం హృతిక్.. రూ.100 కోట్లు ఖర్చు పెట్టారట.
Hruthik Roshan Saba Azad
హృతిక్ రోషన్ 2014లో తన సతీమణి సుజేన్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే సబా ఆజాద్‌తో పరిచయం ఏర్పడింది. బాలీవుడ్‌లో జరిగిన పలు పార్టీలు, డిన్నర్ డేట్స్‌కు వీరిద్దరూ కలిసి హాజరు కావడంతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. సబా షేర్ చేసే పోస్టులకు హృతిక్... లవ్‌సింబల్ ఎమోజీని జత చేసి కామెంట్స్ చేయడంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.