తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గ్రాండ్​ ఈవెంట్​లో రణ్​వీర్​ను పట్టించుకోని దీపిక.. ఇద్దరి మధ్య ఏమైందబ్బా? - దీపికా రణ్​వీర్​ మధ్య ఏమైంది

బాలీవుడ్ స్టార్ కపుల్​ రణ్​వీర్ సింగ్​-దీపికా పదుకొణె మధ్య జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్​మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ ఈవెంట్​లో రణ్​వీర్​ పక్కనే ఉండి చేయి అందించినా.. దీపిక అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయింది.​ ​

.
.

By

Published : Mar 24, 2023, 3:08 PM IST

Updated : Mar 24, 2023, 3:21 PM IST

బాలీవుడ్ మోస్ట్​ బ్యూటిఫుల్​ స్టార్స్ కపుల్స్​లో రణ్​వీర్ సింగ్​-దీపికా పదుకొణె ఒకరు. ఆన్​స్క్రీన్​తో పాటు ఆఫ్​స్క్రీన్​లోనూ ఈ జంట ఎప్పుడూ అన్యోన్యంగా కలిసి ఉంటారు. ఇంకా చెప్పాలంటే బీటౌన్​ జంటలలో చాలా డిఫరెంట్​గా కూడా కనిపిస్తుంటారు. పర్సనల్​ లేదా ప్రొఫెషనల్​ లైఫ్​లో ఒకరి పట్ల మరొకరు ఎంతో గౌరవంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా ఉంటారు. భార్య భర్తలు అయినప్పటికీ పలు ఈవెంట్లలో కూడా క్లోజ్ ఫ్రెండ్స్​లా కలిసి ఉంటూ సందడి చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ గ్రాండ్ ఈవెంట్​లో హీరోయిన్ దీపికా ప‌దుకొణె చేయి పట్టుకుని నడిచేందుకు రణవీర్ సింగ్ ఆసక్తి చూపించారు. ముందుగా కారు దిగిన ఆయన.. రెడ్ కార్పెట్​పై నడిచేందుకు దీపిక కోసం ఎదురు చూశారు. దీపిక కారు దిగగానే.. తన చేయి చాచారు. కానీ దాన్ని చూడనట్టుగానే దీపిక పదుకొణె ముందుకు అడుగులు వేస్తూ నడిచింది. దీంతో రణ్​వీర్​ సింగ్.. తన చేయిని కిందకు దించేసి ముందుకు సాగిపోయారు. ముంబయి వేదికగా జరిగిన ఇండియన్ హానర్ స్పోర్ట్స్​ ఈవెంట్​లో పాల్గొనడానికి హాజరైంది ఈ జంట. అక్కడే ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

ఈ జంట బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు ఇద్దరి మధ్య ఏదో చిన్న వాగ్వాదం జరిగిందేమో అన్నట్టుగా ఉందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరొక యూజర్​.. దీపిక తన చర్యతో రణవీర్​ను అగౌరవపరిచిందని అన్నాడు. రణవీర్ కన్నా తానే పెద్ద స్టార్ అనే భావన దీపికలో ఉందని ఇంకొక నెటిజన్​ కామెంట్​ పెట్టాడు. ఇంకొంతమంది దీపికకు మద్దతు పలుకుతూ.. ఆమె రణ్​వీర్​ చేయి చూడలేదని అంటున్నారు. ఇలా పలువురు నెటిజ‌న్స్ ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటే ఈ జంట గతంలో విడాకులు తీసుకోబోతున్నారంటూ పలు సార్లు జోరుగా ప్రచారం సాగింది. దీనిపై వీరిద్దరూ కూడా స్పందించారు. తమకు ఆ ఆలోచన లేదని ఒకరంటే మరొకరికి ప్రేమ ఉందని తెలిపారు. తామిద్దరూ ఎంతో సంతోషంగా కలిసి ఉన్న ఫొటోలను సోషల్​మీడియాలో షేర్ చేస్తూ రూమర్స్​కు చెక్​ పెట్టారు. ఇకపోతే వీరిద్దరు ప్రస్తుతం తన ప్రొఫెషనల్​ లైఫ్​లో ఫుల్​ బిజీగా గడుపుతున్నారు. రీసెంట్​గా 'సర్కస్'​ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణ్​వీర్​.. ప్రస్తుతం రాకీ ఔర్​ రాణి కే ప్రేమ్ కహాని చిత్రంలో ఆలియాభట్​తో కలిసి నటిస్తున్నారు. దీనికి ప్రముఖ నిర్మాత కరణ్​ జోహార్​ డైరెక్ట్​ చేస్తున్నారు. అలానే దీపికా పదుకొణె కూడా.. ప్రస్తుతం భారీ ప్రాజెక్టులైన.. షారుక్​ ఖాన్​తో 'జవాన్'(గెస్ట్ రోల్​లో మెరవనుంది)​, ప్రభాస్​తో 'ప్రాజెక్ట్​ కె', హృతిక్​ రోషన్​తో 'ఫైటర్'​ చిత్రాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి:కొత్త ట్విస్ట్ ఇచ్చిన నరేశ్​- పవిత్ర​.. ఏంటి ఇదంతా 'మళ్లీ పెళ్లి' కోసమా?

Last Updated : Mar 24, 2023, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details