తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నటి అమలాపాల్​ రెండో పెళ్లి చేసుకున్నారా? నిజమేనా? - అమలా పాల్​ భూపిందర్​ సింగ్​

నటి అమలాపాల్‌కు రెండో పెళ్లి అయ్యిందా? తన స్నేహితుడు, పంజాబీ గాయకుడు భవ్‌నిందర్‌సింగ్‌ దత్‌ను ఆమె వివాహం చేసుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ పత్రికలు. దీంతో ఆమె పెళ్లి వార్తలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

amalapaul
amalapaul

By

Published : Sep 9, 2022, 2:50 PM IST

Amala Paul Second Marriage : పంజాబీ గాయకుడు భవ్‌నిందర్‌సింగ్‌ దత్‌ తనని వేధింపులకు గురి చేస్తున్నాడంటూ అమలాపాల్‌ ఇటీవల పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అమలాపాల్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే భవ్‌నిందర్‌ సింగ్‌ బెయిల్‌ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

2017లోనే అమలతో భవ్‌నిందర్‌ వివాహం జరిగిందని పేర్కొంటూ దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను ఆయన తరఫు న్యాయవాది న్యాయస్థానానికి సమర్పించాడని.. వీటిని పరిశీలించిన న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసిందని పలు పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అమలాపాల్‌ రెండో పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే అయిఉండొచ్చని స్థానిక పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.

అప్పట్లో వైరలైన ఫొటోలు..!
2020లో అమలా పాల్‌ - భవ్‌నిందర్‌ సింగ్‌ తమ సోషల్‌మీడియా ఖాతాల్లో కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. వాటిల్లో పంజాబీ సంప్రదాయంలో వీరు పెళ్లి చేసుకుంటున్నట్లు కన్పించింది. ఇవి వైరల్‌గా మారిన కొన్ని రోజులకే వీరిద్దరూ ఆ ఫొటోలను తమ సోషల్‌మీడియా ఖాతాల నుంచి తొలగించారు. అది కేవలం ఫొటోషూట్‌ మాత్రమేనని, భవ్‌నిందర్‌తో తన పెళ్లి జరగలేదని అమలాపాల్‌ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా తాజాగా ఆమె తమిళనాడు పోలీసులను ఆశ్రయించారు. సినీ పరిశ్రమలోని పరిచయం మేరకు భవ్‌నిందర్‌సింగ్‌ దత్‌ అలియాస్‌ భువి, ఆయన కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి తాను ఓ సినీ సంస్థను ప్రారంభించినట్టు తెలిపారు. దీనికోసం 2018లో విళుపురం జిల్లా పెరియముదలియార్‌ చావడిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నామన్నారు.

తర్వాత విభేదాలు రావడంతో సంస్థ నుంచి విడిపోయామని వెల్లడించారు. తాను సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని భవ్‌నిందర్‌సింగ్‌ దత్‌, అతని బంధువులు బెదిరించి డబ్బు, ఆస్తులను కాజేశారని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. 2014లో కోలీవుడ్‌ దర్శకుడు విజయ్‌తో అమలాపాల్‌ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ మూడేళ్లకే విడిపోయారు.

ఇవీ చదవండి:కమల్ మూవీ షూటింగ్​కు బ్రిటన్​ రాణి.. ఏ సినిమా అంటే?

బేబీ బంప్​తో ఆలియా ఫొటో షూట్​.. అనన్య, రష్మిక హాట్​ లుక్స్​

ABOUT THE AUTHOR

...view details