తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'లవ్​టుడే' హీరోయిన్​తో ధోనీ కొత్త సినిమా గ్లింప్స్​ రిలీజ్​.. పెళ్లి చేసుకుందామంటూ.. - జెర్సీ హరీష్ కల్యాణ్​తో ధోనీ ఎంటర్​టైన్​మెంట్స్

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తన కొత్త తొలి సినిమాకు సంబంధించి సూపర్ అప్డేట్ ఇచ్చాడు. టైటిల్​ లుక్ మోషన్ పోస్టర్​ను రిలీజ్ చేశాడు. ఆ వివరాలు.

Dhoni entertainments with love today ivana
Dhoni entertainments with love today ivana

By

Published : Jan 27, 2023, 3:01 PM IST

Updated : Jan 27, 2023, 6:41 PM IST

భారత క్రికెట్‌‌ చరిత్రలో టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనకంటూ ఓ పేరును లిఖించుకున్నాడు. కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై చెప్పినా.. ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరిస్తూ సక్సెస్​ఫుల్​గా నడిపిస్తూ క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. ఇంకా పలు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 'ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినీ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టాడు. అయితే తాజాగా తన కొత్త తొలి ప్రాజెక్ట్​ను ప్రకటించాడు. 'లెట్స్​ గెట్​ మ్యారీడ్'​ అంటూ టైటిల్​ లుక్​ పోస్టర్​ గ్లింప్స్​ను రిలీజ్ చేశాడు.

టైటిల్​ లాంచ్​లో ధోనీ సతీమణీ సాక్షితో మూవీ టీమ్​

ఈ మూవీలో 'జెర్సీ' ఫేమ్​ హరీష్ కల్యాణ్​, 'లవ్​ టుడే' హీరోయిన్​ ఇవానా, సీనియర్ నటి నదియా, ప్రముఖ హాస్యనటుడు యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి రమేశ్​ తమిళమణి దర్శకత్వం వహిస్తున్నారు. మరిన్ని వివారలు త్వరలోనే రానున్నాయి. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

ఇకపోతే ఈ ప్రొడక్షన్ హౌస్‌కు ఆయన భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. ఇకపోతే ఐపీఎల్ లేటెస్ట్​ సీజన్.. ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే మహీ ప్రాక్టీస్​ కూడ్ మొదలు పెట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా రీసెంట్​గా సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో ఈ సీజన్​లో మహీ ఆడతాడా లేదా అంటూ వచ్చిన అనుమానాలకు తెరపడింది.

టైటిల్​ లాంచ్​లో ధోనీ సతీమణీ సాక్షితో మూవీ టీమ్​

ఇదీ చూడండి:ప్రేయసితో వివాహంబంధంలోకి అడుగుపెట్టిన మరో స్టార్​ ప్లేయర్​

Last Updated : Jan 27, 2023, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details