హైపర్ ఆది.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర షోల్లో చేసే అతడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తనదైన పంచ్‌లతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంటాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ-14 వంటి షోల్లో జడ్డీలు, యాంకర్లు, కంటెస్టెంట్లతో కలిసి కామెడీ పంచ్‌లు పేల్చుతూ సందడి చేస్తుంటాడు.
అయితే తాజాగా ఢీ-14 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో శ్రద్ధాదాస్, హైపర్ ఆది మధ్య రొమాంటిక్ ట్రాక్ నడిచింది. ఈ ముద్దుగుమ్మ అందాలకు ఫిదా అయిన ఆది.. ఆమెను తన మాటలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆది మాటలకు ఫిదా అయిన శ్రద్ధా.. అతడికి ముద్దు ఆఫర్ చేసింది.
ఇక శ్రద్ధా ముద్దు కోసం అతడు మంచు గడ్డపై నిల్చునే సాహసం చేయడం, ఆమె కోసం పాటలు పాడటం చాలా ఫన్నీగా, ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. మరి అతడు.. శ్రద్ధా చెప్పిన సమయం మొత్తం ఐస్ గడ్డపై నిల్చున్నాడా.. ఆమె ముద్దును అందుకున్నాడా అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.
ఫస్ట్‌లవ్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ తమ ఫస్ట్‌లవ్ గురించి కూడా చెప్పుకొచ్చారు. ఆది కూడా తన మొదటి ప్రేమ గురించి తెలిపాడు. తాను ఎనిమిదో తరగతి వరకు తమ ఊరులోని స్కూల్లో చదివానని, ఆ తర్వాత తొమ్మిదో తరగతి కోసం ప్రైవేట్ స్కూల్‌కు మారినట్టు చెప్పాడు. అక్కడే ఓ అమ్మాయిని చూసి ఇష్టపడినట్లు తెలిపాడు.
ఇదీ చూడండి: వీల్‌చైర్‌లో దిగ్గజ బాక్సర్ మైక్‌టైసన్, ఏమైంది