తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ధనుష్‌ హాలీవుడ్‌ చిత్రం.. 'గ్రేమ్యాన్‌' ట్రైలర్‌ ఆగయా - ధనుశ్​ ది గ్రే మ్యాన్​ దర్శకుడు

Dhanush The grey man movie trailer: హీరో ధనుష్‌ నటించిన హాలీవుడ్‌ చిత్రం 'ది గ్రేమ్యాన్‌' ట్రైలర్​ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం యాక్షన్​ సన్నివేశాలతో అదిరిపోయింది.

Dhanush The grey man trailer
ధనుష్​ గ్రే మ్యాన్ ట్రైలర్​

By

Published : May 24, 2022, 8:59 PM IST

Dhanush Hollywood movie trailer: కోలీవుడ్‌ ప్రముఖ హీరో ధనుష్‌ నటించిన హాలీవుడ్‌ చిత్రం 'ది గ్రేమ్యాన్‌'. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు కోసం ఓ సర్​ప్రైజ్ ఇచ్చింది మూవీటీమ్​. ట్రైలర్​ను విడుదల చేసింది. పూర్తిస్థాయి యాక్షన్‌ సన్నివేశాలతో రూపొందిన ఈ ట్రైలర్‌లో ధనుష్‌ ఓ సీన్‌లో తళుక్కున మెరిశారు. చాలా స్టైలిష్‌గా కనిపించారు.

'కెప్టెన్‌ అమెరికా', 'అవెంజర్స్‌' సిరీస్‌ తదితర చిత్రాలను అందించిన దర్శక ద్వయం రస్సో బ్రదర్స్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ధనుష్‌తో పాటు రియాన్‌ గోస్లింగ్‌, క్రిస్‌ ఎవాన్స్‌, అనా డి అర్మాస్‌, జెస్సికా హెన్విక్‌ తదితర హాలీవుడ్‌ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలకానుంది. 'నెట్‌ఫ్లిక్స్‌'లో జులై 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఇదీ చూడండి: కార్తి.. మూడు నెలల్లో మూడు సినిమాలు- ఆసక్తిగా 'థోర్‌' ట్రైలర్​

ABOUT THE AUTHOR

...view details