తమిళ స్టార్ హీరో ధనుశ్.. తమిళంలోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి తన విలక్షణమైన నటనతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా ఆయన నటించిన బైలింగువల్ సినిమా 'సార్' రీసెంట్గా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలి రోజు నుంచే మంచి కలెక్షన్లను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద ముందుకెళ్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఎనిమిది రోజుల కలెక్షన్ వివరాలను మూవీటీమ్ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది.
వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల బిజినెస్ చేయగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదైంది. అలాగే తమిళంలో రూ. 19 కోట్లు, కర్ణాటకలో రూ. 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్లో రూ. 6 కోట్లు అవ్వగా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 35 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలిసింది. దీంతో వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 36 కోట్లుగా నమోదైంది. అయితే ఇప్పుడీ సినిమా నిర్మాణ సంస్థ తెలిపిన వసూళ్ల వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా రూ.75కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్నట్లు తెలిపింది. ఇది చూసిన ధనుశ్ అభిమానులు, నెటిజన్లు.. ఈ చిత్రం రూ.100కోట్లు అందుకోవడం పక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు.