తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వారికి లీగల్​ నోటీసులు పంపిన ధనుష్​.. రూ.10కోట్లు కట్టాలంటూ!

Dhanush legal notice: ఓ వృద్ధ దంపతులకు నటుడు ధనుష్ లీగల్‌ నోటీసులు పంపించారు. ఇకపై తన పరువుకు భంగం కలిగిస్తే, రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని అందులో పేర్కొన్నారు.

dhanush parents case
ధనుష్ తల్లిదండ్రుల కేసు

By

Published : May 22, 2022, 11:00 AM IST

Dhanush legal notice: ఇంతకాలం తమ పరువుకు భంగం కలిగించింది చాలని, ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఓ వృద్ధ దంపతులకు నటుడు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా లీగల్‌ నోటీసులు పంపించారు. ధనుష్‌ తమ మూడో కుమారుడని, సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే ఇంటి నుంచి పారిపోయాడంటూ మధురైకి చెందిన కతిరేసన్, మీనాక్షి దంపతులు నాలుగేళ్ల నుంచి ఆరోపణలు చేస్తున్నారు. నటుడిగా స్థిరపడిన నాటి నుంచి ధనుష్‌ తమకు ప్రతి నెలా రూ.65 వేలు పంపిస్తున్నారని ఆ దంపతులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

ఈ ఆరోపణలతో విసిగిపోయిన ధనుష్‌, ఆయన తండ్రి కసూర్తిరాజా.. తాజాగా ఆ దంపతులకు లీగల్‌ నోటీసులు పంపించారు. తమ గౌరవానికి ఇబ్బంది కలిగించేలా చేస్తోన్న ఆరోపణలకు ఇకనైనా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కోరారు. ఇంతకాలం చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని పేర్కొంటూ క్షమాపణలు చెబుతూ ఓ స్టేట్‌మెంట్‌ని వెంటనే విడుదల చేయాలని ధనుష్‌ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: దీపిక, పూజా.. టాప్​ టు బాటమ్​ సమ్మర్​ ట్రీట్​.. అదిరిందమ్మా!

ABOUT THE AUTHOR

...view details