తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ది గ్రే మ్యాన్'​ అప్డేట్​.. అదిరిపోయే యాక్షన్​ సీన్​లో హీరో ధనుష్​ - ధనుష్​ హాలీవుడ్ మూవీ ది గ్రే మ్యాన్​ ట్రైలర్​

Dhanush The Grey Man update: తన సహజమైన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ధనుష్‌. ప్రస్తుతం ఆయన.. 'ది గ్రే మ్యాన్‌' చిత్రంతో హాలీవుడ్​ అరంగేట్రం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఆయన పాత్రకు సంబంధించిన ఓ గ్లింప్స్​ విడుదుల చేశారు. ఇందులో ధనుష్​ అదిరిపోయే ఫైట్​ చేస్తూ కనిపించారు.

dhanush
ది గ్రే మ్యాన్ అప్డేట్​

By

Published : Jul 12, 2022, 10:21 AM IST

Updated : Jul 12, 2022, 11:37 AM IST

Dhanush The Grey Man update: తమిళ స్టార్​ హీరో ధనుష్‌ వరుసపెట్టి సినిమాలు చేస్తూ జోరు మీద ఉన్నారు. తమిళ చిత్రాల్లోనే కాదు.. టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌ అంటూ దూసుకెళ్తున్నారు. ఇప్పుడాయన నటిస్తున్న తొలి హాలీవుడ్​ మూవీ 'ది గ్రే మ్యాన్‌'. రుసో బ్రదర్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీటీమ్​ ఒక్క రోజు గ్యాప్​లోనే ఫ్యాన్స్​కు రెండు సర్​ప్రైజలు ఇచ్చింది. ఇండియాకు దర్శకులు రుసో బ్రదర్స్​ వస్తున్నట్లు తెలిపిన చిత్రబృందం.. మంగళవారం సినిమాలోని ధనుష్​కు సంబంధించిన ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్​ చేసింది. దీనిని ధనుష్​ సోషల్​మీడియాలో పోస్ట్​ చేయగా.. అది వైరల్​గా మారింది. 56 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆయన అదిరిపోయే యాక్షన్​ సీన్​లో కనిపించారు. ఇద్దరు హాలీవుడ్​ యాక్టర్స్​తో ఫైట్​ చేస్తూ కనిపించారు.

సోమవారం రిలీజ్​ చేసిన వీడియోలో దర్శకులు రుసోబ్రదర్స్​ భారత్​కు వస్తున్నట్లు తెలపడంతో పాటు.. ధనుష్.. ​ఈ చిత్ర అనుభవాలను తెలిపారు. ఇందులో భాగస్వామ్యం అవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ఎలాంటి అంశాలతో ఈ ప్రాజెక్ట్ రూపొందనుందో తెలిపారు. "ది గ్రే మ్యాన్‌ ఓ రోలర్‌కోస్టర్‌ వంటి చిత్రం. యాక్షన్‌, డ్రామా, క్రేజీ స్టంట్స్‌ ఇలాంటి ఎన్నో అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసినందుకు, ఈ సినిమాలో నేనూ కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా షూట్‌ అత్యద్భుతంగా సాగింది. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్న" అని ధనుష్‌ వివరించారు.

కాగా, ఇప్పటికే విడుదలై ఈ సినిమా ప్రచార చిత్రం అభిమానులను ఆకట్టుకుంది. కానీ అందులో ధనుష్​ చాలా తక్కువగానే కనిపించారు. ఓ పోరాట సన్నివేశంలో భాగంగా కారు మీద ఉన్న ధనుష్‌ మంచి యాక్షన్‌ మూడ్‌లో ఉన్నట్లు ప్రచార చిత్రం ఉంది. మార్క్‌ గ్రీనీ రచించిన 'ది గ్రే మ్యాన్‌' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ర్యాన్‌ గోస్లింగ్‌, క్రిస్‌ ఏవన్స్‌, జెసికా హెన్‌విక్‌ తదితరులు నటించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమా జులై 22న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

ఇదీ చూడండి:'కార్తికేయ 2' వాయిదా.. రిలీజ్​ అప్పుడే.. ఆ హీరోలతో పోటీ​

Last Updated : Jul 12, 2022, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details