తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ధనుశ్​-శేఖర్​ కమ్ముల ప్రాజెక్ట్​.. స్క్రిప్ట్​ వర్క్​ కంప్లీట్​.. సెట్స్​పైకి అప్పుడే! - శేఖర్​ కమ్ముల కొత్త చిత్రాలు

డైరెక్టర్​ శేఖర్​ కమ్ముల, హీరో ధనుశ్ కొత్త సినిమా పరిస్థితేంటి? ఉన్నట్టా? లేనట్టా? అని అందరూ అనుకుంటున్నారు. అయితే శేఖర్​ కమ్ముల తాజాగా స్క్రిప్ట్​ వర్క్​ పూర్తి చేశారట. త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుందట. ఆ వివరాలు..

dhanush and sekhar kammula movie update
dhanush and sekhar kammula movie update

By

Published : Oct 4, 2022, 11:28 AM IST

శేఖర్ కమ్ముల.. ఒక కథ పై చాలా రోజులు కసరత్తు చేస్తారు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈలోగా ఆయన ప్రాజెక్ట్​కు సంబంధించిన ఎటువంటి అప్​డేట్స్ ఉండవు. సినిమాకు సంబంధించిన హడావిడి ఎక్కడా కనిపించదు. ఇదంతా ఆయన వర్కింగ్​ స్టైల్​. అయితే ఆ మధ్య ధనుశ్​తో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన సమాచారం ఇంతవరకూ లేదు. దాంతో ఈ ప్రాజెక్టు ఉన్నట్టా.. లేనట్టా? అని అందరూ అనుకుంటున్నారు.

అయితే శేఖర్ కమ్ముల ఎప్పటిలానే తన ప్రాజెక్టుకి సంబంధించిన పనులను చకచకా చేసుకుంటూ వస్తున్నారట. ఇప్పటికే ఆయన స్క్రిప్ట్ వైపు నుంచి అన్ని పనులను పూర్తి చేశారని చెబుతున్నారు. సెట్స్​పైకి వెళ్లేందుకు సన్నాహాలు ముగింపు దశకు చేరుకున్నాయట. దాంతో ఈ సినిమాను జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకుని వెళ్లడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది.

ప్రస్తుతం ధనుశ్ ఒక వైపు వరుస తమిళ సినిమాలను లైన్లో పెడుతూనే, మరో వైపు తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ మూవీ పూర్తయ్యాక ఆయన శేఖర్ కమ్ముల ప్రాజెక్టు చేయనున్నారని తెలుస్తోంది. 'లవ్ స్టోరీ' తరువాత శేఖర్ కమ్ముల నుంచి రానున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి ఉంది.

ఇవీ చదవండి:బాలీవుడ్​ హీరో హీరోయిన్ల ఈ 'గార్బా' స్టెప్పులు చూశారా?

వారెవ్వా.. తమన్నా, శ్రియ లేటెస్ట్​ ఫొటోలు అదిరాయిగా!

ABOUT THE AUTHOR

...view details