Dhamaka Teaser : మాస్ మహారాజా రవి తేజ నుంచి మరో రాబోతున్న మరో మాస్ జాతర 'ధమాకా'. ఇందులో రవి తేజ సరసన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల ఆడిపాడింది. ఈ చిత్రాన్ని దర్శకుడు త్రినాధరావు నక్కిన తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరపుకుంటున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్టేట్ వచ్చింది. దీపావళి కానుకగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. టీజర్ చూస్తే మళ్లీ రవి తేజకు ఈ సినిమా సాలిడ్ కం బ్యాక్‌గా నిలిచేలా కనిపిస్తోంది.
మాస్ మహారాజా తన మాస్ డైలాగ్స్, ఫైట్స్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ టీజర్ లో తన మార్క్ కామెడీ టైమింగ్‌తో జనాలకు మళ్లీ మంచి ఎంటర్టైన్మెంట్ అందించనున్నారని స్పష్టం అవుతోంది. ఇందులో రవితేజ లుక్స్ కూడా చాలా క్లాస్‌గా ఉన్నాయి. సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఈ సినిమాలో సీనియర్ నటులు తనికెళ్ల భరణి, రావురమేశ్, అలీ, సత్యం రాజేశ్, ప్రవీన్, పవిత్రా లోకేశ్, రాజశ్రీ నాయర్ ప్రధాన పాత్రలు పోషించారు.