Devisriprasad Bollywood Movie: 'పుష్ప' సినిమాతో బాలీవుడ్‌లో దేవి శ్రీ ప్రసాద్ పేరు మారుమోగింది. ఈ సినిమా కోసం అతడు స్వరపరచిన పాటలన్నీ హిందీ శ్రోతలను విపరీతంగా అలరించాయి. ఆ తర్వాత దేవిశ్రీకి బాలీవుడ్‌లో వరుసగా అఫర్లు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న 'కభీ ఈద్ కభీ దివాళీ'లో రెండు పాటలకు సంగీతాన్ని సమకూర్చబోతున్నారు.
తాజాగా అతడు బాలీవుడ్‌లో మరో భారీ బడ్జెట్ సినిమాకు మ్యూజిక్‌ను అందించబోతున్నారు. వరుణ్ ధావన్, జాన్వీకపూర్ జంటగా 'బవాల్' పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో పూర్తిస్థాయి మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గతంలో సల్మాన్‌ఖాన్ నటించిన రెడీ, జయహో, రాధే సినిమాల్లో ఒక్కో పాటకు సంగీతాన్ని అందించారు దేవిశ్రీ. కానీ ఓ బాలీవుడ్ సినిమాకు అన్ని పాటలతో పాటు నేపథ్య సంగీతాన్ని సమకూర్చడం దేవిశ్రీప్రసాద్‌కు ఇదే తొలిసారి.
Agent Movie Postponed: అక్కినేని నట వారసుడు అఖిల్ కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కెరీర్ ఆరంభం నుంచి వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్‌కు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' కాస్త ఊరటనిచ్చింది. ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలని సురేందర్ రెడ్డితో చేతులు కలిపారు. ప్రస్తుతం వీళ్ల కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'ఏజెంట్'. హీరో అఖిల్.. ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ అయినట్లు గతంలో విడుదలైన పోస్టర్‌లను చూస్తే తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ విడుదల వాయిదా పడనుందట.