దేవీ శ్రీ ప్రసాద్.. ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. తన మ్యూజిక్‌తో సంగీత ప్రియులను ఊర్రూతలూగిస్తుంటారు. ఆయన పాటకు, సంగీతాన్ని ఫిదా అవ్వని వారుండరు. అయితే తాజాగా ఆయన ఓ యంగ్ హీరోయిన్ పాటకు ఫిదా అయిపోయారు. ఎవరంటే..
కేతిక శర్మ చేసిన పనికి అలా ట్వీట్ చేసిన దేవీ శ్రీ, ఏంటంటే - కేతిక శర్మ దేవీ శ్రీప్రసాద్
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్.. యంగ్ హీరోయిన్ కేతిక శర్మను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. అది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఏంటంటే.
'పుష్ప' సినిమాలోని శ్రీవల్లి పాట ఎంతలా హిట్ అయిందో తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా హీరోయిన్ కేతిక శర్మ ఆ పాటను పాడింది. ఇప్పటికే తన అందంతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ భామ.. తన గాత్రంతో అలరించింది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ.. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'రంగ రంగ వైభవంగా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో సందడి చేసింది. ఇందులో భాగంగా కేతిక.. పుష్పలోని శ్రీవల్లి పాటను అద్భుతంగా పాడింది. ఈ వీడియో దేవీ శ్రీ ప్రసాద్ కంట పడింది. కేతిక పాటను పాడిన విధానానికి ఆయన ఫిదా అయ్యారు. ఆమెపై ప్రశంసలను కురింపిచాjg. ఆ వీడియోను తన సోషల్‌మీడియాలో ట్వీట్ చేశారు. మామూలుగానే సెలెబ్రిటీలతో పాటలు పాడిస్తుంటారు డీఎస్పీ. మరి కేతిక గాత్రానికి ఫిదా అయినా ఆయన ఈ సారి ఆమెతో ఎలాంటి పాటను పాడిస్తారో చూడాలి.
ఇదీ చూడండి: బ్రహ్మాస్త్రం అడ్వాన్స్ బుకింగ్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్.. బాలీవుడ్‌ను ఆదుకుంటుందా