Devil Release Postponed : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా పీరియాడిక్ యాక్షన్ చిత్రం 'డెవిల్'. 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్'.. అనేది ట్యాగ్ లైన్. సంయుక్తా మేనన్ కథానాయికగా నటించింది. 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ - సంయుక్త కలిసి మరోసారి నటించిన చిత్రమిది. నవంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడా తేదీకి సినిమా రావడం లేదని, వాయిదా వేసినట్లు తెలిసింది.
బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ (గ్రాఫిక్స్) వర్క్ ఇంకా పూర్తి కాలేదని, అందువల్ల థియేటర్లలోకి ముందుగా ప్రకటించిన తేదీకి కాకుండా కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం అందింది. త్వరలోనే కొత్త విడుదల తేదీ అనౌన్స్ చేయనున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందివ్వడం కోసం చిత్ర బృందం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని 'డెవిల్' యూనిట్ పేర్కొనట్లు కథనాలు వస్తున్నాయి. కాగా, 'డెవిల్' సినిమాను రిలీజ్ చేయాలనుకున్న నవంబర్ 24కు తేదీకి... శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన 'కోట బొమ్మాళి పీఎస్' రిలీజ్ అవ్వనుంది.