Devil Movie Twitter Review In Telugu : నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'డెవిల్'. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉప శీర్షిక. అభిషేక్ నామా దర్శక నిర్మాత. దర్శకుడిగా ఆయన తొలి చిత్రమిది. 'బింబిసార' తర్వాత కల్యాణ్ రామ్ జోడీగా హీరోయిన్ సంయుక్తా మీనన్ మరోసారి నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీన విడుదలైంది. ఆల్రెడీ విదేశాల్లో ప్రీమియర్ షోలు స్టార్ట్ అయ్యాయి. సోషల్ మీడియాలో సినిమా టాక్ ఎలా ఉంది?
'డెవిల్' పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. సినిమాలోని ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయని తెలిపారు. కల్యాణ్ రామ్ యాక్షన్, నేపథ్య సంగీతం, ఇంటర్వెల్తోపాటు ప్రీ ఇంటర్వెల్ సూపర్ ఉన్నాయని పేర్కొన్నారు. కానీ స్క్రీన్ ప్లేలో కొంచెం ల్యాగ్ ఉందని చెప్పారు.
'డెవిల్ బొమ్మ మాసివ్ బ్లాక్ బస్టర్! థియేటర్లలో ఊచకోతనే' అని ఓ నందమూరి అభిమాని ట్వీట్ చేశారు. కల్యాణ్ రామ్ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ చేశారన్నారు. ఇంటర్వెల్ భారీగా ఉందని పేర్కొన్నారు. నేపథ్య సంగీతం బాగుందని, కల్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ బదులు మరొకరిని ఊహించుకోలేమని చెప్పారు. కథ ఆసక్తికరంగా ముందుకు వెళ్లిందని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయని పేర్కొన్నారు.
వీఎఫ్ఎక్స్ ఇంకా బాగా చేయాల్సింది!
Devil Review Telugu : 'డెవిల్' సినిమా వీఎఫ్ఎక్స్ విషయంలో నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇంకా బాగా చేయాల్సి ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఫస్టాఫ్ నేరేషన్ ఫ్లాట్‌గా ఉందని మరొక మీమ్ పేజీలో పేర్కొన్నారు. మరికొందరు మిక్స్డ్ రివ్యూ ఇస్తున్నారు.
నందమూరి కల్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ మరోసారి జంటగా నటించిన 'డెవిల్' సినిమాలో మణిమేఖల పాత్రలో రాజకీయ నాయకురాలిగా మరో హీరోయిన్ మాళవికా నాయర్ నటించారు. రోజీగా బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నరౌజి యాక్ట్ చేశారు. ఓ స్పెషల్ సాంగ్‌కు డ్యాన్స్ కూడా చేశారు. అభిషేక్ పిక్చర్స్‌పై దేవాంశ్ నామా సమర్పించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.