తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Adipurush: హనుమంతుడిగా నటించింది ఎవరో తెలుసా? - prabhas adipurush

ప్రభాస్​ ఆదిపురుష్ టీజర్​ విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అయితే ఈ టీజర్​లో​ హనుమంతుడిగా కనిపించిన నటుడు ఎవరా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే?

Devdatta Nage plays Adipurush hanuman role
దేవదత్త గజాననే

By

Published : Oct 3, 2022, 12:03 PM IST

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ వచ్చేసింది. ఆదివారం సాయంత్రం అయోధ్యలోని సరయు నది తీరాన గ్రాండ్‏గా విడుదల చేశారు. రిలీజ్ అయిన కాసేపట్లోనే టీజర్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించగా.. సైఫ్ అలీఖాన్ రావణుడిగా.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది. అయితే వీరి ముగ్గురి గురించి ప్రేక్షకులకు గతంలోనే తెలుసు. అయితే ఆదిపురుష్ టీజర్‏లో హనుమంతుడు కూడా స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచాడు. ఇప్పటివరకు కేవలం ప్రధాన పాత్రలను మాత్రమే పరిచయం చేసిన డైరెక్టర్ ఓంరౌత్.. హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది టీజర్ రిలీజ్​ వరకు క్లారిటీగా చెప్పలేదు. కానీ దేవదత్త అనే నటుడు నటిస్తున్నాడని సినిమా ప్రకటన చేసినప్పుడు ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత ఆ పాత్ర గురించి పెద్దగా ఎవరూ మాట్లాడుకోలేదు. ఇక తాజాగా విడుదలైన టీజర్‏లో హనుమంతుడిగా దేవదత్త గజాననే కనిపించారు. అయితే ఈయన గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. దీంతో ఆయన ఎవరా అని కొంతమంది నెటిజన్లు తెగ ఆరాతీస్తున్నారు.

దేవదత్త గజాననే

ఇంతకీ ఆయన ఎవరంటే.. హనుమంతుడిగా కనిపించిన నటుడి పూర్తి పేరు దేవదత్త గజానన్ నాగే. మరాఠీ సీరియల్స్.. సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 'జై మల్హర్'​ ధారావాహికలో 'ఖన్​దోబా' పాత్రతో బుల్లితెరపై మంచి క్రేజ్​ సంపాదించుకున్నారు. అలాగే 'సంఘర్ష్​', 'వన్స్​ అపాన్​ ఏ టైమ్​ ఇన్​ ముంబయి, 'దోబారా', 'సత్యమేవ జయతే', 'తాన్హాజీ', 'వీర్​ శివాజీ', దేవయాని, బాజీరావ్ మస్తానీ చిత్రాల్లో నటించారు. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్​తో రూపొందుతున్న ఆదిపురుష్ చిత్రంలోనూ హనుమంతుడిగా కనిపించారు.

దేవదత్త గజాననే
దేవదత్త గజాననే

కాగా, దేవదత్తకు హనుమంతుడు ఇష్ట దైవం. తనకు హనుమంతుడితో ప్రత్యేక అనుబంధం ఉందని.. 17 ఏళ్ల వయసులో తాను వర్కౌట్​ చేయడం ప్రారంభించినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన తొలి జిమ్ సెంటర్​కు హనుమాన్ వ్యాయమశాల అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఆదిపురుష్ చిత్రంలో హనుమంతుడిగా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. తన పాత్ర కోసం శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఆదిపురుష్ సినిమా ద్వారా, ప్రభాస్, సన్నీ సింగ్, కృతి సనన్ తనకు మంచి స్నేహితులు అయ్యారని చెప్పుకొచ్చారు.

దేవదత్త గజాననే
దేవదత్త గజాననే

ఇదీ చూడండి: 'ఆదిపురుష్' టీజర్ అదరహో.. రాముడిగా ప్రభాస్ సూపర్..

ABOUT THE AUTHOR

...view details